Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అడిలైడ్ టెస్టులో చెలరేగుతున్న లంబో: ఆసీస్ కెప్టెన్‌ ఔటయ్యాడిలా (వీడియో)

India vs Australia Live Score, 1st Test Day 2: Ishant finds the edge from Paine through to Pant and the Aussie skipper is gone for 5

హైదరాబాద్: అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 177 పరుగుల వద్ద జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో కుమ్మిన్స్(10) ఎల్బీగా వెనుదిరగాడు. దీంతో 81 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది.

టీమిండియా బౌలర్లు ఒత్తిడి తెస్తున్నప్పటికీ నిలకడగా ఆడుతున్నారు. ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్ (55) హాఫ్ సెంచరీ సాధించాడు. అతనికి తోడు మిచెల్ స్టార్క్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నాడు. అంతకముందు భారత్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేస్తుండటంతో ఆస్ట్రేలియా ఆరో వికెట్‌ కోల్పోయింది.

ఐదో వికెట్‌ కోల్పోయిన అనంతరం క్రీజులోకి వచ్చిన ఆ జట్టు కెప్టెన్ టిమ్‌ పైన్‌(5)ను ఇషాంత్‌ పెవిలియన్‌కు పంపాడు. తొలి బంతికే ఫోర్‌ కొట్టిన పైన్‌ దూకుడు మీద కనిపించిన టిమ్ పైన్ ఆ తర్వాత ఇన్నింగ్స్ 63.1 ఓవర్లో ఇషాంత్‌ శర్మ వేసిన బంతికి వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

1
43623

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత బౌలర్లలో స్పిన్నర్ అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టగా... ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Story first published: Friday, December 7, 2018, 13:01 [IST]
Other articles published on Dec 7, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+