అడిలైడ్ టెస్టులో పూజారా సెంచరీ: టెస్టుల్లో 5వేల పరుగులు

న్యూ ఢిల్లీ: అడిలైడ్ వేదికగా మొదలైన తొలి టెస్టులో పూజారా సెంచరీ కొట్టేశాడు. తన అంతర్జాతీయ టెస్టు క్రికెట్ కెరీర్లో 16వ సెంచరీని బాదేశాడు. వరుసగా టాపార్డర్ వికెట్లు పడిపోతున్న తరుణంలో తానొక్కడూ నిలబడి స్కోరును నడిపించాడు. విదేశీ గడ్డపై ఆడుతున్నామంటే గుర్తొచ్చే పేరు చతేశ్వర్ పూజారా. మునపటి మ్యాచ్‌ల స్కోరు ఆధారంగా 5వేల పరుగులకు 95 పరుగుల దూరంలో తొలి టెస్టుకు బరిలోకి దిగాడు. అలాంటి తరుణంలో క్రీజులోకి దిగి అంచనాలను అందుకున్నాడు.
పూజారా టస్టు కెరీర్లోని మైలురాళ్లు:
టీమిండియా టెస్టు కెరీర్లో ద్రవిడ్‌తో పాటుగా 5వేల పరుగుల మైలు రాయిని దాటింది పూజారా ఒక్కడే. ఈ క్రమంలో 3000పరుగుల మైలురాయిని దాటేందుకు 67ఇన్నింగ్స్ తీసుకున్నాడు. 84 ఇన్నింగ్స్‌లో 4000పరుగులు పూర్తి చేయగలిగాడు. ఇక ప్రస్తుతం ఆడుతోన్న 108వ ఇన్నింగ్స్‌లో 5వేల పరుగులు చేరుకున్నాడు.
తొలి టెస్టులో మాత్రమే చేసిన పరుగులు
అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ఆడకముందు 5వేల పరుగుల మైలురాయిని దాటేందుకు 95పరుగులు కావాల్సి ఉంది. ఈ మ్యాచ్‌తో ఆ రికార్డును కొల్లగొట్టడమే కాకుండా కెరీర్లో 16వ టెస్టు సెంచరీని కూడా బాదేశాడు.
ఆసీస్ గడ్డపై మూడో సెంచరీ:
టీమిండియాకు ముప్పు తిప్పలు పెడతాం. ఓడించి తీరతాం. అంటూ ప్రగల్భాలు పలికిన ఆసీస్ క్రికెటర్లకు ధీటైన సమాధానం చెబుతూ.. సెంచరీ బాదేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా గడ్డపై మూడో సెంచరీని కొట్టాడు. అప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్‌కు దన్నుగా నిలిచి స్కోరును 200కు పైగా చేర్చడంలో కీలకంగా వ్యవహరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications