Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రిస్బేన్‌లో తొలి టీ20: వర్షం అడ్డంకి, టీమిండియా విజయ లక్ష్యం 174

India vs Australia, Live Score 1st T20I: Glenn Maxwell, Chris Lynn Take Australia To 158/4

హైదరాబాద్: బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టీమిండియాకు ఆతిథ్య జట్టు 174 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. వరుణుడు అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. దీంతో నిర్ణీత ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.

అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టీమిండియా విజయ లక్ష్యాన్ని 174 పరుగులుగా సవరించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో మ్యాక్స్‌వెల్ 24 బంతుల్లో 46 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదడం విశేషం.

1
43620

నాలుగు సిక్సులు బాదిన మ్యాక్స్‌‌వెల్

మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌లో మొత్తం నాలుగు సిక్సర్లు ఉన్నాయి. మార్కస్ స్టోయినిస్ 19 బంతుల్లో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, క్రిస్ లిన్, (37), ఆరోన్ ఫించ్ (27) పరుగులతో రాణించారు. ఆరు టీ20ల తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఈ మ్యాచ్‌లో రెండెంకల స్కోరు చేయడం విశేషం.

తొలి వికెట్ తీసిన ఖలీల్ అహ్మద్

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు చక్కటి శుభారంభం ఇవ్వలేదు. ఓపెనర్ డార్షీ షార్ట్ (7)ను ఖలీల్ అహ్మద్ పెవిలియన్‌కు చేర్చగా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్ లిన్‌తో కలిసి మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతోన్న సమయంలో తొలుత ఫించ్‌ను, తర్వాత లిన్‌ను కుల్దీప్ పెవిలియన్‌కు పంపాడు.

16.1 ఓవర్ల వద్ద వరుణుడు అడ్డంకి

16.1 ఓవర్ల వద్ద వరుణుడు అడ్డంకి

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టోయినిస్, మ్యాక్స్‌వెల్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించారు. వీరిద్దరూ వికెట్ పడకుండా ఆడుతూనే భారీ షాట్లతో అలరించారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు హాఫ్ సెంచరీకి పైగా పరుగులు నమోదు చేశారు. ఈ క్రమంలో 16.1 ఓవర్ల వద్ద వరుణుడు అడ్డంకిగా మారడంతో అంఫైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు.

మ్యాచ్‌ని 17 ఓవర్లకు కుదించిన అంఫైర్లు

మ్యాచ్‌ని 17 ఓవర్లకు కుదించిన అంఫైర్లు

గంట తర్వాత వర్షం తగ్గడంతో మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత మ్యాచ్ ప్రారంభమైన వెంటనే మ్యాక్స్‌వెల్‌(46)ను బుమ్రా ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా తన 4 ఓవర్ల వేసి 55 పరుగులు ఇవ్వగా.. ఖలీల్ అహ్మద్ 3 ఓవర్లలో 42 పరుగులు సమర్పించుకున్నాడు.

రెండు క్యాచ్‌లు జారవిడిచిన భారత ఫీల్డర్లు

రెండు క్యాచ్‌లు జారవిడిచిన భారత ఫీల్డర్లు

కుల్దీప్ యాదవ్ మాత్రమే 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. బూమ్రాకు ఒక వికెట్ లభించింది. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు రెండు క్యాచ్‌లు జారవిడచడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయగలిగింది.

Story first published: Wednesday, November 21, 2018, 16:21 [IST]
Other articles published on Nov 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+