For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్రిస్బేన్‌లో తొలి టీ20: తొలి ఓవర్‌లో ఒక్క పరుగు ఇచ్చిన భువనేశ్వర్

India vs Australia, Live Score 1st T20: Austrlia 1-0 after 1 over

హైదరాబాద్: బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్‌లో ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. తన బౌన్సర్లతో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కులు చూపిస్తున్నాడు. ప్రస్తుతానికి 2 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 5/0తో నిలిచింది.

ప్రస్తుతం క్రీజులో ఆరోన్ ఫించ్(3), షార్ట్(2) పరుగులతో ఉన్నారు. బుధవారం ప్రారంభమైన ఈ తొలి టీ20లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్‌ పరిస్థితులు బౌలింగ్‌కే అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఫీల్డింగ్‌ ఎంచుకున్నట్లు కోహ్లీ చెప్పాడు.

మరోవైపు ముందుగా టాస్‌ గెలిస్తే తాము కూడా బౌలింగ్‌ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఆసీస్‌ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ అన్నాడు. ఆసీస్ గడ్డపై మొత్తం మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్‌తో ఆసీస్ గడ్డపై సుదీర్ఘ పర్యటనకు టీమిండియా శ్రీకారం చుట్టబోతోంది.

1
43620

బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న ఆసీస్ స్టార్ ప్లేయర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్‌ స్మిత్ ప్రస్తుతం జట్టులో లేకపోవడంతో ఆస్ట్రేలియా జట్టు బలహీనంగా కనిపిస్తోంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు సొంతగడ్డపై భారత్‌కి ఎలా పోటీనిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ అద్భుతమైన పామ్‌లో ఉండగా, విండిస్‌తో మూడు టీ20ల సిరిస్‌లో విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ చాలా రోజుల తర్వాత టీ20ల్లో ఆడుతున్నాడు. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకు 15 టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత్ జట్టు ఏకంగా పది మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇందులో ఆసీస్ గడ్డపైన ఇరు జట్లు ఆరు టీ20లు ఆడగా.. అందులోనూ నాలుగింట భారత్‌ గెలుపొందింది. టీ20 జరుగుతున్న బ్రిస్బేన్ పిచ్ ఎక్కువగా పేసర్లకి అనుకూలించనున్న నేపథ్యంలో టీమిండియా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది.

మరోవైపు ఆస్ట్రేలియా జ‌ట్టులో లెగ్ స్పిన్న‌ర్ ఆడ‌మ్ జంపాకు చోటు ద‌క్కింది. ఈ మ్యాచ్‌లో ఇండియా ఫెవ‌రేట్‌గా దిగుతోంద‌ని మాజీ ఆసీస్ స్పిన్న‌ర్ షేన్ వార్న్ అంచ‌నా వేస్తున్నాడు.

జట్ల వివరాలు:
భారత్ తుది జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్

ఆస్ట్రేలియా తుది జట్టు: అరోన్ ఫించ్‌ (కెప్టెన్‌), క్రిస్‌ లిన్‌,డీఆర్క్ షార్ట్‌, బెన్‌ మెక్‌డెర్మాట్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, స్టాయినిస్‌, బెరెన్‌డార్ఫ్‌, అలెక్స్‌ కేరీ, స్టాన్‌లేక్‌, ఆండ్రూ టై, ఆడమ్ జంపా

Story first published: Wednesday, November 21, 2018, 13:56 [IST]
Other articles published on Nov 21, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+