For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Vs Australia, 1st ODI: 4 పరుగులకే 3 వికెట్లు, కష్టాల్లో టీమిండియా

India vs Australia, Live Score 1st ODI: Rohit Sharma, MS Dhoni Look To Steady India After Early Blows

హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆసీస్ పేసర్ల దెబ్బకు భారత జట్టు నాలుగు పరుగులకే మూడు ప్రధాన వికెట్లను చేజార్చుకుంది. ప్రస్తుతం 15 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా నిర్దేశించిన 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. ధావన్‌ తాను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌కు చేరాడు. బెహ్రన్‌డోర్ఫ్‌ వేసిన తొలి ఓవర్ ఆఖరు బంతికి శిఖర్‌ ధావన్‌ పరుగులేమీ చేయకుండా ఎల్బీగా వెనుదిరిగాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం‌ నాలుగో ఓవర్లోనే పెవిలియన్‌ చేరాడు. నాలుగో ఓవర్లో రిచర్డ్‌సన్‌ వేసిన మూడో బంతిని ఆడబోయిన కోహ్లీ(3) స్టాయినిస్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో టీమిండియా నాలుగు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై వెంటనే అంబటి రాయుడు డకౌట్‌ కావడంతో భారత్‌ కష్టాల్లో పడింది.

ఈ మ్యాచ్‌లో యువ పేసర్‌ రిచర్డ్‌సన్‌... కెప్టెన్ కోహ్లీ, అంబటి రాయుడు వికెట్లు తీసి ఆసీస్‌కు బ్రేక్ ఇచ్చాడు. అంతకముందు ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో ఉస్మాన్ ఖ‌వాజా (59), షాన్ మార్ష్ (54), హ్యాండ్స్ కోంబ్ (73) హాఫ్ సెంచరీలు చేశారు.

1
43627

ఆట ఆరంభంలో టీమిండియా బౌలర్లు మంచి ప్రదర్శన కనబరిచినా.. ఆ తర్వాత ఆసీస్ బ్యాట్స్‌మన్ కుదురుకున్నారు. చివర్లో ఆల్ రౌండ‌ర్ స్టోయినిస్ 43 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 47 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భార‌త బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్‌, కుల్దీప్‌ల‌కి రెండు వికెట్స్ పడగొట్టగా... జ‌డేజాకు ఒక్క వికెట్ లభించింది.

Story first published: Saturday, January 12, 2019, 14:11 [IST]
Other articles published on Jan 12, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+