Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia, 1st ODI: రోహిత్ శర్మ సెంచరీ

India vs Australia, Live Score 1st ODI: Centurion Rohit Sharma Holds The Fort For India In Sydney

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. 110 బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్ల సాయంతో రోహిత్ శర్మ సెంచరీని నమోదు చేశాడు. 40వ ఓవర్ ఐదో బంతికి రెండు పరుగులు చేయడంతో రోహిత్ శర్మ సెంచరీని సాధించాడు.

వన్డల్లో రోహిత్ శర్మకు ఇది 22వ సెంచరీ. 4 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్‌‌ను ధోని(51)తో కలిసి ఆదుకున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచి సంయమనంతో ఆడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఆసీస్ పేసర్లను ధాటిగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తున్నాడు. క్రీజులో రోహిత్ శర్మ ఒంటరి పోరాటం చేస్తున్నాడు.

289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ప్రస్తుతం 45 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌ శర్మ(128)తో పాటు భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. ఛేదనలో ఓపెనర్ శిఖర్ ధావన్ (0), రాయుడు (0)తో పాటు కోహ్లీ (3) నిరాశపరిచినా.. ధోని (51)తో కలిసి రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

1
43627

ఆసీస్ గడ్డపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసింది వీళ్లే:
* సచిన్ టెండూల్కర్-9
* రోహిత్ శర్మ-7
* రికీ పాంటింగ్ -6
* విరాట్ కోహ్లీ-5

Story first published: Saturday, January 12, 2019, 15:53 [IST]
Other articles published on Jan 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+