For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సింపుల్ క్యాచ్ జారవిడిచాడు: ఖవాజాకు లైఫ్ ఇచ్చిన ధావన్

India vs Australia,3rd ODI : Kuldeep Divides The Finch-Khawaja's Partnership | Oneindia Telugu
India vs Australia, Live Cricket Score, 3rd ODI in Ranchi: Khawaja dropped early Dhawan

హైదరాబాద్: రాంచీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్లు సెంచరీ దిశగా సాగుతున్నారు. 30 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 186 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖవాజా(85), ఆరోన్ ఫించ్ (86) పరుగులతో ఉన్నారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఆరోన్ ఫించ్, ఉస్మాన్ ఖవాజా చక్కటి శుభారంభాన్నిచ్చారు. దూకుడుగా ఆడుతూ పరుగుల వరద పారిస్తున్నారు. ఆసీస్ ఓపెనర్లను ఔట్ చేసేందుకు కోహ్లీ పదే పదే బౌలర్లను మార్చినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

1
45587

ధావన్ ఇచ్చిన లైఫ్‌తో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీకి చేరువయ్యాడు. రవీంద్ర జడేజా వేసిన ఏడో ఓవర్‌ నాలుగో బంతికి ఖవాజా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ బంతిని ఖవాజా రివర్స్‌ స్వీప్‌ ఆడగా అది బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఉన్న ధావన్‌ చేతుల్లో పడింది.

అయితే ఆ సునాయాసమైన క్యాచ్‌ను ధావన్‌ వదిలేయడంతో అతిడికి లైఫ్‌ లభించింది. మరోవైపు ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ ఆరోన్ ఫించ్ ఎట్టలేకు తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. గత కొంతకాలంగా పేలవ ఆటతీరుతో నిరాశపరుస్తున్న ఫించ్.. మూడో వన్డేలో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన కేదార్ జాదవ్ బౌలింగ్‌లో వరుసగా 6, 4, 6 బాదిన ఫించ్ 51 బంతుల్లో 7 పోర్లు, 3 సిక్సుల సాయంతో 50 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో ఆరోన్ ఫించ్‌కి ఇది 19వ హాఫ్ సెంచరీ కాగా, గత 10 ఇన్నింగ్స్‌ల్లో ఇదే హాఫ్ సెంచరీ కావడం విశేషం. గత 9 ఇన్నింగ్స్‌ల్లో 22, 5, 41, 11, 6, 6, 14, 0, 37 పరుగులు చేశాడు.

Story first published: Friday, March 8, 2019, 15:47 [IST]
Other articles published on Mar 8, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+