Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విశాఖలో తొలి టీ20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

Australia Elect to Bowl First

హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సుదీర్ఘ పర్యటనకు తెరలేచింది. విశాఖపట్నం వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్‌తో చివరి రెండు వన్డేలు, టీ20 సిరీస్‌కు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లి మళ్లీ జట్టులోకి తిరిగొచ్చాడు.

ఈ మ్యాచ్‌తో భారత్ తరుపున యువ స్పిన్నర్ మయాంక్ మార్కండే అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేశాడు. టాస్ అనంతరం ఓపెనర్ శిఖర్ ధావన్‌కు విశ్రాంతినిచ్చి కేఎల్ రాహుల్‌కు అవకాశం ఇచ్చినట్లు కోహ్లీ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, విజయ్ శంకర్‌ల స్థానంలో.. కేఎల్ రాహుల్, ఉమేశ్ యాదవ్, మయాంక్ మార్కండేలకు జట్టులో చోటు కల్పించారు.

మరోవైపు ఆస్ట్రేలియా తరఫున పీటర్ హ్యాండ్స్‌కాంబ్ టీ20 అరంగేట్రం చేయనున్నాడు. ఆస్ట్రేలియా తరుపున వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా అతనే తీసుకోనున్నట్లు ఫించ్ తెలిపాడు. దేశంలో భారత్ చేతిలో చిత్తుగా ఓటమిపాలైన ఆస్ట్రేలియా.. భారత గడ్డపై ఆతిథ్య జట్టును ఓడించి.. ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

1
45583

జట్ల వివరాలు:
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్(కెప్టెన్), డి ఆర్కీ షార్ట్, మార్కస్ స్టోనిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, పీటర్ హాండ్స్‌కోండ్, ఆష్‌టన్ టర్నర్, నాతన్ కౌంటర్-నైల్, పాట్ కమ్మిన్స్, జై రిచర్డ్‌సన్, జేసన్ బెహ్రెన్‌డోర్ఫ్, ఆడం జంపా.

ఇండియా: రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషబ్ పంత్, ఎంఎస్ ధోనీ(కీపర్), దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్యా, ఉమేశ్ యాదవ్, మయాంక్ మార్ఖండే, యుజవేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా.

Story first published: Sunday, February 24, 2019, 19:05 [IST]
Other articles published on Feb 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+