ఈడెన్‌లో కుల్దీప్ అరుదైన ఘనత: మూడో బౌలర్‌గా చరిత్ర
హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియతో జరిగిన రెండో వన్డేలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి స్పిన్నర్‌గా.. వన్డేల్లో హ్యాట్రిక్ ఫీట్ నమోదు చేసిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు.
మొత్తంగా భారత్ తరఫున హ్యాట్రిక్ సాధించిన బౌలర్లలో మూడో బౌలర్‌గా నిలిచాడు. గురువారం ఆస్ట్రేలియాతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో కుల్దీప్ ఈ ఘనత సాధించాడు. ఇన్నింగ్స్ 33వ ఓవర్‌లో కుల్దీప్ ఓ అద్భుతాన్నే చేసి చూపించాడు.

33వ ఓవర్‌లో కుల్దీప్ అద్భుతం
32.2వ బంతికి మాథ్యూ వేడ్, 32.3వ బంతికి అగర్, 32.4వ బంతికి కమిన్స్‌ను వరుస బంతుల్లో పెవిలియన్‌కు కుల్దీప్ హ్యాట్రిక్ రికార్డు అందుకున్నాడు. అంతకముందు 1987లో చేతన్ శర్మ న్యూజిలాండ్‌పై ఈ ఘనత సాధించి తొలి హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించాడు.

1991లో ఇదే ఈడెన్‌లో శ్రీలంకపై కపిల్ దేవ్
ఆ తర్వాత 1991లో ఇదే ఈడెన్‌లో శ్రీలంకపై కపిల్ దేవ్ హ్యాట్రిక్ సాధించాడు. 26 ఏళ్ల తర్వాత మళ్లీ కుల్దీప్ యాదవ్ ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. రెండో వన్డేలో హ్యాట్రిక్ సాధించడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. హ్యాట్రిక్‌పై పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో కుల్దీప్ మాట్లాడాడు.

హ్యాట్రిక్ సాధిస్తానని కలలో కూడా అనుకోలేదు
'హ్యాట్రిక్ సాధిస్తానని కలలో కూడా అనుకోలేదు. ఇది చాలా ప్రత్యేకమైంది. దీనివల్ల మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. చాలా గర్వించదగ్గ క్షణం ఇది. ఆరంభంలో కొన్ని ప్రదేశాల్లో బంతులు వేయడానికి చాలా ఇబ్బందిపడ్డా. క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం' అని అన్నాడు.

బౌలింగ్ ఎలా చేయాలని మహీ బాయ్‌ని అడిగా
'గత మ్యాచ్‌లో ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదారు. అదో అనుభవం. బౌలింగ్ ఎలా చేయాలని మహీ బాయ్‌ని అడిగా. అప్పుడు నీవు ఎలా వేయాలనుకుంటున్నావో అలాగే వేయి అని సలహా ఇచ్చాడు. ఇది అద్భుతంగా పని చేసింది' అని కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications