న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: టాప్‌లేపిన కేఎల్ రాహుల్.. మైదానంలో మాత్రం కాదు!!

India vs Australia: KL Rahul reached 5 Million Followers On Twitter

సిడ్నీ: కేఎల్ రాహుల్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలి కాలంలో టీమిండియా జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో. గత కొంతకాలంగా ఇటూ బ్యాటింగ్‌లో అటు వికెట్ కీపర్‌గా సత్తా చాటుతూ భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్ అయిన తర్వాత భారత జట్టు వికెట్ కీపర్‌ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలనే విషయంలో ఏర్పడిన సందిగ్ధతను రాహుల్ మరింత పెంచేశాడు.

అకస్మాత్తుగా తెరపైకి

ఇప్పటికే రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహా, సంజు శాంసన్ వంటి స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌లు సత్తా చాటుతూ ఎంఎస్ ధోనీ స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా కేఎల్ రాహుల్ పేరు తెరపైకి వచ్చింది. పంత్ గాయపడడంతో కీపింగ్ బాధ్యతలు చేపట్టిన రాహుల్.. ఆ స్థానంలో పాతుకుపోయాడు. ఓపెనర్‌గా సత్తా చాటుతూనే వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా చక్కగా నిర్వహిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. అద్భుత ఆటతో ఆకట్టుకుంటున్న రాహుల్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది.

5 మిలియన్లు

5 మిలియన్లు

మంగళవారం కేఎల్ రాహుల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. అయితే ఇది క్రికెట్ మైదానంలో మాత్రం కాదు.. సోషల్ మీడియాలో. రాహుల్‌ను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 5 మిలియన్లకు చేరింది. ఇలా 50 లక్షల మంది తనను ఫాలో అవుతుండటంతో రాహుల్‌ తెగ సంబరపడిపోతున్నాడు. వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశాడు. 'మీ మద్దతు.. ఈ ప్రయాణాన్ని స్పెషల్‌గా మార్చేసింది. ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా ఎప్పుడూ నా వెంటే ఉన్నారు. మీ అందరి ఆదరాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు' అని రాహుల్ ట్వీట్ చేశాడు.

2014లో ఆరంగేట్రం

2014లో ఆరంగేట్రం

కేఎల్ రాహుల్ 2014లో భారత్ తరఫున తొలి టెస్టు ఆడాడు. అప్పటి నుంచే అతనికి అభిమానుల ఆదరణ దక్కింది. ఇప్పటి వరకు 36 టెస్టులు, 35 వన్డేలు. 45 టీ20లు ఆడిన రాహుల్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్‌ తరఫున కొన్ని మంచి ఇన్నింగ్సులు ఆడాడు. వన్డేల్లో 45.93 సగటుతో 1332 పరుగులు చేసిన రాహుల్.. టీ20ల్లో 44.05 సగటుతో 1542 పరుగులు చేశాడు. ఇక టెస్టులో 2006 రన్స్ చేశాడు. మూడు ఫార్మాట్లలోనూ రాహుల్ సెంచరీ చేశాడు.

వైస్ కెప్టెన్‌గా సేవలు

వైస్ కెప్టెన్‌గా సేవలు

ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. గాయం కారణంగా భారత జట్టు వైస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ ఆసీస్ టూర్‌కు దూరం కావడంతో అతని స్థానాన్ని రాహులే భర్తీ చేశాడు. ఈ టూర్‌‌లో పరిమిత ఓవర్ల సిరిస్‌లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా సేవలు అందించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2020లో కూడా రాహుల్ అద్భుతంగా రాణించాడు. ఒక సెంచరీ, 5 అర్థ సెంచరీలతో మొత్తం 14 మ్యాచ్‌ల్లో 670 పరుగులు చేశాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్.. జట్టు విఫలమైనా టోర్నీ ముగిసేసరికి టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం.

డే/నైట్‌ టెస్టుకు టీంను ప్రకటించిన బీసీసీఐ.. గిల్, పంత్, జడేజాకు షాక్.. తుది జట్టు ఇదే!

Story first published: Wednesday, December 16, 2020, 16:24 [IST]
Other articles published on Dec 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X