మయాంక్ టెస్టు అరంగేట్రంపై ట్విట్టర్‌లో కేఎల్ రాహుల్ ఇలా! (ట్వీట్)

హైదరాబాద్: మయాంక్ అగర్వాల్ రూపంలో కర్ణాటకకు చెందిన మరో బ్యాట్స్‌మన్ టెస్టుల్లో భారత్ తరుపున ఓపెనర్‌గా అరంగేట్రం చేశాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా బుధవారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టులో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
దీంతో భారత్ తరుపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన 295వ టెస్టు క్రికెటర్‌గా మయాంక్ అగర్వాల్ అరుదైన గుర్తింపు పొందాడు. తొలి రెండు టెస్టుల్లో ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ఘోరంగా విఫలం కావడంతో మూడో టెస్టులో ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, హనుమ విహారిలను పంపుతూ జట్టు మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.
తద్వారా 71 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై మయాంక్ అగర్వాల్ రూపంలో ఓ భారత బ్యాట్స్‌మన్ ఓపెనర్‌గా క్రీజులోకి అడుగుపెట్టాడు. అంతకముందు 1947 డిసెంబర్‌లో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ తరుపున ఆమీర్ ఎలాహి ఓపెనర్‌గా బరిలోకి దిగి తొలి ఇన్నింగ్స్‌లో 10 పరుగులకే ఔటయ్యాడు.
అయితే, ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మయాంక్ అగర్వాల్ అరంగేట్రం చేయడంపై టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ట్విట్టర్‌లో తనదైన శైలిలో స్పందించాడు. "నా ప్రాణ స్నేహితుడు టెస్టు క్యాప్‌ని అందుకుని... దేశం తరుపున అరంగేట్రం చేయడాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా కూడా ఉంది" అని కేఎల్ రాహుల్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
కర్ణాటకకు చెందిన మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌లు రంజీ క్రికెట్‌లో ఒకే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. తనకు వచ్చిన అవకాశాన్ని మయంక్ చక్కగా వినియోగించుకున్నాడు.

ఎంతో అనుభవం ఉన్న బ్యాట్స్‌మన్‌లా
ఎంతో అనుభవం ఉన్న బ్యాట్స్‌మన్‌లాగా ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ఆసీస్ బౌలర్లు బౌన్సర్లతో బెంబేలెత్తించినా బెదరకుండా క్రీజులో పాతుకుపోయాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్ర టెస్ట్‌లోనే అత్యధిక పరుగులు చేసిన భారత్ బ్యాట్స్‌మన్‌గా మయాంక్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 71 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టాడు.

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన టెస్ట్‌లో
1947 డిసెంబర్‌లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన టెస్ట్‌లో హాఫ్ సెంచరీ చేసిన దత్తు ఫాడ్కర్(51).. ఆసీస్ గడ్డపై ఆరంగేట్ర టెస్టులో హాఫ సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడు మయాంక్ అగర్వాల్ (76) పరుగులతో ఆ రికార్డుని అధిగమించాడు. 27 ఏళ్ల మయాంక్ మెల్‌బోర్న్ టెస్ట్‌లో నిలకడగా ఆడాడు.

ఆత్మవిశ్వాసంతో కనిపించిన మయాంక్
క్రీజులో ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. తొలి రెండు టెస్టుల్లో భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టిన స్పిన్నర్ నాథన్ లియాన్‌పై మయాంక్ ఎదురు దాడికి దిగాడు. ఓపెనర్ విహారితో కలిసి తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించిన మయాంక్, పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 83 పరుగులు జోడించాడు.

సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76), ఛటేశ్వర్ పుజారా (68) హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 215/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో ఛటేశ్వర్ పుజారా(68), విరాట్ కోహ్లీ (47) పరుగులతో క్రీజులో ఉన్నారు. మయాంక్ ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications