న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాహుల్.. ఆడింది చాల్లే.. ఈ టిక్కెట్‌తో బెంగళూరుకు వచ్చేయ్!

India vs Australia: KL Rahul gets out for a duck; Twitter fuming over his repeated failures

పెర్త్: పర్యటన ఎక్కడైనా ప్రదర్శన ఒక్కటే.. స్వదేశమైనా.. విదేశమైనా సింగిల్ డిజిట్‌కు మించిన స్కోరు చేయడానికే ఆపసోపాలు పడుతున్నాడు టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్. సోమవారం జరిగిన రెండో టెస్టులోనూ పేలవంగా అవుటవడంతో ఓ చెత్త రికార్డును నెత్తినేసుకున్నాడు. పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 2, 0తో పేలవంగా బౌల్డయిన కేఎల్ రాహుల్.. టెస్టుల్లో అతి తక్కువ మ్యాచ్‌ల్లోనే అత్యధిక సార్లు బౌల్డయిన భారత ఓపెనర్‌గా రికార్డుల్లో నిలిచాడు.

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రమే 44 పరుగులు చేసి ఫర్వాలేదనిపించిన రాహుల్.. తర్వాతి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ దారుణంగా విఫలమైయ్యాడు. పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 2 పరుగులకే ఔటైన రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. దీంతో ఈ ఓపెనర్‌ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

కాంతి కంటే వేగంగా రాహుల్ పెవిలియన్‌కు

ఐన్‌స్టీన్ సిద్ధాంతం తప్పు. కాంతి కంటే వేగంగా ప్రయాణంచేది లేదనది సత్యం కాదు. రాహుల్ అంత కంటే స్పీడ్‌గా పెవిలియన్ చేరిపోగలడు.

‘జీరో' మూవీని ప్రమోట్ చేస్తున్నందుకు

నీ సున్నా పరుగులతో అనుష్కా-షారూఖ్‌ల ‘జీరో' మూవీని ప్రమోట్ చేస్తున్నందుకు థ్యాంక్స్.

నీ లాంటి బ్యాట్స్‌మన్‌ను ఎత్తుకుని

బాబూ నువ్వు దేవుడివి. నీ లాంటి బ్యాట్స్‌మన్‌ను ఎత్తుకుని ఊరేగించాలి.

ఈ టికెట్ తీసుకో. బెంగళూరు వచ్చేయ్

ఇదిగో ఈ టికెట్ తీసుకో. బెంగళూరు చేరుకోవడానికి నీకు ఉన్న వేగవంతమైన విమానం కోసం టిక్కెట్ ఇదే.

మళ్లీమళ్లీ ఫెయిలయ్యే రాహుల్‌ను జట్టులోకి

రాహుల్‌ వంద పరుగుల తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. హర్భజన్ సింగ్.. గౌతం గంభీర్.. జహీర్ ఖాన్ ఎవ్వరూ ఇలా వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్నా టీమిండియాలో కొనసాగలేదు. ఇలా రాహుల్‌కు ఎన్ని అవకాశాలు కల్పిస్తారు. మళ్లీమళ్లీ ఫెయిలయ్యే రాహుల్‌ను జట్టులోకి ఎందుకు తీసుకుంటున్నారు.

రాహుల్.. ఇక ఆట చాలిస్తే మంచిది

డాన్ బ్రాడ్‌మన్ కూడా తన చివరి ఇన్నింగ్స్‌లో నాలుగు బంతులు ఆడి సున్నా పరుగులే చేశాడు. ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా నాలుగు బంతులకు సున్నా పరుగులు మాత్రమే చేశాడు. ఇక అతను ఆట చాలిస్తే మంచిది.

1
43624
Story first published: Monday, December 17, 2018, 17:19 [IST]
Other articles published on Dec 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X