భారత ఆటగాళ్లను అస్సలు కవ్వించం.. స్లెడ్జింగ్, వ్యక్తిగత దూషణలు ఉండవు: ఆసీస్ కోచ్

IND VS AUS 2020:No స్లెడ్జింగ్ But Fun Against India, People Get Nervous Coming To Australia: Langer

సిడ్నీ: భారత్‌తో జరగనున్న అప్‌కమింగ్ సిరీసుల్లో తమ జట్టు నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు ఉండవని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్‌ లాంగర్‌ అన్నాడు. మాటల యుద్ధం జరగకుండానే ఇరు జట్ల మధ్య పోటీ తారస్థాయిలో ఉంటుందని తెలిపాడు. ఈ సిరీస్‌ల్లో ఎలాంటి స్లెడ్జింగ్ ఉండదని, ప్రత్యర్థుల జోలికే తాము పోమని ఈ ఆసీస్ కోచ్ స్పష్టం చేశాడు. నవంబర్ 27న మొదలయ్యే ఫస్ట్ వన్డేతో ఈ సుదీర్ఘ పర్యటన ఆరంభం కానుంది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆసీస్ కోచ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆసీస్‌ అంటే భయం..

ఆసీస్‌ అంటే భయం..

‘ప్రత్యర్థి జట్లు ఆస్ట్రేలియా పర్యటనకు రావడం కాస్త ఇబ్బందిగా భావిస్తాయి. అయితే దానికి స్లెడ్జింగ్ ఒక్కటే కారణం కాదు. అత్యుత్తమ ఆటగాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని అలా ఫీలయ్యేవి. షేన్ వార్న్‌, మెకాగ్రత్, స్టీవ్ వా, గిల్‌క్రిస్ట్, పాంటింగ్‌ వంటి ఆటగాళ్లతో ఆడాలనే భావనే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు ఎక్కువ ఇబ్బందికి గురిచేస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా మేం మైదానంలో, వెలుపలా వివాదాలకు దూరంగా ఉన్నాం. కేవలం పోటీలోనిసరదాని కోరుకుంటున్నాం'అని లాంగర్‌ స్పష్టం చేశాడు.

నేను హామీ ఇవ్వగలను..

నేను హామీ ఇవ్వగలను..

ఇక ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ కెప్టెన్ టిమ్ పైన్ ఎంతో సరదా మనిషని లాంగర్ చెప్పుకొచ్చాడు. ‘కెప్టెన్‌ టిమ్ పైన్‌ ఎంతో సరదా మనిషి. జోక్స్ వేస్తూ అందర్ని నవిస్తాడు. అలాగే కోహ్లీని మేం ఎంతో ఇష్టపడతాం. మొత్తంగా ఆటగాళ్లపై వచ్చే ఒత్తిడి మాటలతో కాకుండా, పోటీ ద్వారానే వస్తుందని నేను హామీ ఇవ్వగలను. ఇక భారత్‌‌తో సిరీస్‌ జరుగుతున్నందుకు మేం ఎంతో సంతోషిస్తున్నాం. ఇరు జట్లలో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. మాటల యుద్ధం జరగకుండానే మైదానంలో వేడి ఉంటుంది' అని లాంగర్‌ తెలిపాడు.

 మంచి కాంబినేషన్

మంచి కాంబినేషన్

‘జస్‌ప్రీత్ బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలరని తెలుసు. అతనికి తోడుగా మహ్మద్ షమీ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరితో టీమిండియా కాంబినేషన్ బాగుంది. వారి పట్ల మాకు గౌరవం కూడా ఉంది. ఐపీఎల్ సందర్భంగా వారిని మా ఆటగాళ్లు ఎదుర్కొన్నారు. గత రెండు, మూడు ఏళ్లుగా భారత్‌తో 14 వన్డేలు ఆడాం. ఇద్దరి ముఖాముఖి 7-7గా ఉంది. ప్రత్యర్థి ఆటగాళ్లలోని ప్రతి ఒక్కరి గురించి మా ప్లేయర్లకు తెలుసు. ఈ పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. ఏ టీమ్, మరే ఆటగాళ్లు పైచేయి సాధిస్తారో చూడాలి'అని లాంగర్ పేర్కొన్నాడు. భారత స్పిన్నర్లు కూడా చెలరేగగలరని, వారిపై కూడా తమకు గౌరవం ఉందన్నాడు.

 వార్నర్ కూడా..

వార్నర్ కూడా..

భారత్‌తో సిరీస్‌లో స్లెడ్జింగ్‌కు దూరంగా ఉంటామని ఇటీవల వార్నర్‌ కూడా తెలిపిన సంగతి తెలిసిందే. కంగారూల గడ్డపై మ్యాచ్‌ అంటేనే ఆస్ట్రేలియా ఆటగాళ్ల కవ్వింపులు ఉంటాయని అందరూ భావిస్తుంటారు. కానీ, లాంగర్, వార్నర్‌ ప్రకటనలతో ఈ సారి భారత్‌తో జరిగే సిరీస్‌ భిన్నంగా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, రెండు నెలలపాటు జరిగే ఈ సుదీర్ఘ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. సిడ్నీ శుక్రవారం వేదికగా తొలి వన్డే జరగనుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Wednesday, November 25, 2020, 15:31 [IST]
Other articles published on Nov 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X