
యాషెస్‌కు ఏమాత్రం తీసిపోదు:
బుధవారం జోష్ హేజిల్‌వుడ్ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'చివరిసారి టీమిండియా టెస్ట్ సిరీస్ గెలిచింది. అయితే మేము ఆస్ట్రేలియాలో ఎక్కువ సిరీస్‌లను కోల్పోము. ఆ ఓటమి బాధించింది. ఆ సమయంలో మా ఆటగాళ్లు ఎక్కడ ఉన్నారో తెలుసు. ఆ ఓటమి ఇప్పడు మాకు ఓ ప్రేరణ. యాషెస్ తర్వాత భారత్-ఆస్ట్రేలియా సిరీస్ కూడా హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ సిరీస్ యాషెస్‌కు ఏమాత్రం తీసిపోదు. గత 10-15 సంవత్సరాలుగా భారత పేసర్లు మెరుగుపడుతూనే ఉన్నారు. వారి బౌలింగ్ బాగుంది. ఇషాంత్ శర్మ కూడా ఇక్కడికి వస్తే బౌలింగ్ విభాగం మరింత పటిష్టం అవుతుంది' అని అన్నాడు.

బుమ్రాను అలసిపోయేలా చేయాలి:
'జస్ప్రీత్ బుమ్రా యాక్షన్ ప్రత్యేకం. కొద్దిపాటి రనప్ సాయంతో వేగంగా బంతులు వేయగలడు. అతడు రోజు మొత్తం, సిరీస్ అంతా ఒకేలా పేస్‌ను మెయింటేన్ చేయగలడు. ఇండియాకు అతడే కీలకం. బంతి కొత్తదైనా, పాతదైనా అతడు వికెట్లు తీయగలడు. బుమ్రాను త్వరగా అలసిపోయేలా చేయాలి. అది కూడా తొలి రెండు టెస్టుల్లోనే చేయాలి. అప్పుడే ఆస్ట్రేలియా సిరీస్ గెలవగలదు. ఇది జరగాలంటే మా బ్యాట్స్‌మన్‌పైనే ఆధారపడివుంది. వికెట్లు కోల్పోకుండా ఉండాలి' అని జోష్ హేజిల్‌వుడ్ అభిప్రాయపడ్డాడు. బుమ్రా ప్రస్తుతం టాప్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2020లో 27 వికెట్లు పడగొట్టి.. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

కోహ్లీ లేకున్నా:
'టాప్ 30 భారత క్రికెటర్లు ఇక్కడకు వచ్చారు. యువకులు, సీనియర్లతో టీమిండియా పటిష్టంగా ఉంది. శుబ్‌మన్ గిల్‌కు ఆడే అవకాశం రావొచ్చు. హార్దిక్ పాండ్యా టీ20 క్రికెట్‌లో ఫినిషర్‌గా ఎదిగాడు. రోహిత్ శర్మ క్లాస్ బ్యాట్స్‌మన్. చటేశ్వర్ పూజారా, అజింక్య రహానె ఉన్నారు. ఇంతకుముందు పుజారా బాగా ఆడాడు. పాత పాఠశాల టెస్ట్ బ్యాట్స్‌మన్. అతడిని త్వరగా పెవిలియన్ చేర్చేందుకు ప్రయత్నిస్తాం. విరాట్ కోహ్లీ చివరి మూడు టెస్టులకు అందుబాటులో లేకున్నా.. టీమిండియాపై ఆ ప్రభావం పడదనుకుంటున్నా. ఎందుకంటే ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ బాగుంది. మా బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. నాథన్‌తో పాటు స్టార్క్, కమ్మిన్స్, హాజిల్‌వుడ్ వికెట్లు తీస్తారు' అని హేజిల్‌వుడ్ చెప్పుకొచ్చాడు.
రైనా.. అన్ని పాత్రల్లో సరిగ్గా సరిపోతావు: ప్రియాంక
https://telugu.mykhel.com/cricket/priyanka-raina-posts-heartwarming-message-for-her-husband-suresh-raina-031658.html


Click it and Unblock the Notifications
