Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సూపర్ హేజిల్‌వుడ్.. 73 ఏళ్ల తర్వాత అత్యుత్తమ బౌలింగ్‌ ఇదే!!

India vs Australia: Josh Hazlewood 5 for 8 most economical 5 wicket haul by an Australian

అడిలైడ్: భారత్‌తో జరిగిన డే/నైట్‌ టెస్టులో ఆస్ట్రేలియా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. కోహ్లీసేన రెండో ఇన్నింగ్స్‌లో 36/9 అత్యల్ప స్కోరు నమోదు చేయడంతో ఆసీస్‌ సునాయాస విజయం సాధించింది. 90 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ బ్యాట్స్‌మన్‌ ఆడుతూపాడుతూ ఛేదించారు. ఓపెనర్లు మాథ్యూ వేడ్‌(33; 53 బంతుల్లో 5x4), జో బర్న్స్ ‌(51నాటౌట్‌; 63 బంతుల్లో 7x4, 1x6) రాణించారు. అంతకుముందు భారత్ 36 పరుగులకే పరిమితమవడంలో జోష్‌ హేజిల్‌వుడ్‌ కీలక పాత్ర పోషించాడు.

డే/నైట్‌ టెస్టులో ఫాస్ట్‌ బౌలర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ ఎకానమీ నమోదు చేశాడు. అడిలైడ్‌ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టు మూడో రోజు ఆటలో 5 ఓవర్లు వేసిన హేజిల్‌వుడ్..‌ కేవలం 8 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అందులో మూడు ఓవర్లు మెయిడిన్‌ కావడం విశేషం. 73 ఏళ్ల తర్వాత అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన ఆస్ట్రేలియా బౌలర్‌గా జోష్‌ రికార్డు సృష్టించాడు.

టెస్టు క్రికెట్‌లో ఐదు, అంతకన్నా ఎక్కువ వికెట్లు తీయడం జోష్‌ హేజిల్‌వుడ్‌కు ఇది ఎనిమిదోసారి. టెస్టుల్లో ఇప్పటి వరకు 52 మ్యాచ్‌లు ఆడిన హేజిల్‌వుడ్..‌ 201 వికెట్లు పడగొట్టాడు. వృద్ధిమాన్ సాహా, ఆర్ అశ్విన్‌ల‌ను వ‌రుస బంతుల్లో ఔట్ చేసిన హేజ‌ల్‌వుడ్ ఆ ఓవ‌ర్‌లో హ్యాట్రిక్ కోసం ప్ర‌య‌త్నించాడు. కానీ కుదరలేదు. ఈ మ్యాచ్‌లో హేజ‌ల్‌వుడ్ నెలకొల్పిన ఎకానమీ.. గత 88 సంవత్సరాలుగా ఐదు వికెట్లను పైగా తీసిన ఏ బౌలర్ నమోదు చేయలేదు.

టెస్టు చ‌రిత్ర‌లో భార‌త జ‌ట్టు అత్య‌ల్ప స్కోర్‌కు ఔటైంది. రెండవ ఇన్నింగ్స్‌లో కేవ‌లం 36 ర‌న్స్‌కే కోహ్లీసేన తోక‌ముడిచింది. ఇప్ప‌టి వ‌ర‌కు టెస్టు చ‌రిత్ర‌లో న‌మోదు అయిన అత్య‌ల్ప స్కోరు మాత్రం ఆస్ట్రేలియా ఖాతాలోనే ఉన్న‌ది. 1955లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కేవ‌లం 26 ప‌రుగుల‌కే ఆలౌటైంది. 1896లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 30 ర‌న్స్‌కే ఓ ఇన్నింగ్స్‌ను ముగించింది. 1924లోనూ ఇంగ్లండ్ చేతిలోనే సౌతాఫ్రికా కేవ‌లం 30 ర‌న్స్ చేసింది. 1899లో ఓ సారి ఇంగ్లండ్ చేతిలో సౌతా‌ఫ్రికా 35 ర‌న్స్ చేసింది.1932లో ఆస్ట్రేలియా చేతిలో దారుణంగా ఓడిన సౌతాఫ్రికా ఓ ఇన్నింగ్స్‌లో కేవ‌లం 36 ర‌న్స్ మాత్ర‌మే చేసింది. 1902లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కేవ‌లం 36 ర‌న్స్ చేసింది.

Story first published: Saturday, December 19, 2020, 17:18 [IST]
Other articles published on Dec 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+