India vs Australia: టీ20ల్లో అరుదైన రికార్డుకి చేరువలో బుమ్రా

హైదరాబాద్: టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీ20ల్లో మరో రికార్డుకు చేరువయ్యాడు. ఆస్ట్రేలియాతో బుధవారం బెంగళూరు వేదికగా జరగనున్న రెండో టీ20లో బుమ్రా ఈ రికార్డును అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో మూడు వికెట్లు సాధించిన బుమ్రా టీ20ల్లో 50 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

41 మ్యాచుల్లో 51 వికెట్లు తీసిన బుమ్రా
ప్రస్తుతం బుమ్రా 41 మ్యాచుల్లో 51 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ 52 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అతనికి చేరువయ్యేందుకు బుమ్రా ఒక వికెట్ దూరంలో నిలిచాడు. రెండో టీ20లో బుమ్రా అశ్విన్ రికార్డుని సవరించే అవకాశం ఉంది.

రెండో టీ20లో మరో రెండు వికెట్లు తీస్తే
రెండో టీ20లో బుమ్రా మరో రెండు వికెట్లు తీస్తే.. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం అశ్విన్ 52 వికెట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. అశ్విన్ 46 మ్యాచుల్లో 52 వికెట్లు తీశాడు. అతని కంటే నాలుగు మ్యాచ్‌లు ముందుగానే బుమ్రా ఈ రికార్డు సాధించే అవకాశం ఉంది.

బుధవారం రెండో టీ20
టీ20ల్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్లలో బుమ్రాది మూడోస్థానం కావడం విశేషం. రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20 బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications