India vs Australia: బుమ్రా, షమీ దూరం.. సైనీ, సిరాజ్‌లకు అవకాశం!!

హైదరాబాద్: సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమిండియా సిడ్నీ చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే. నవంబర్ 27 నుంచి ఆరంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. అయితే టెస్ట్ సిరీస్ కంటే ముందుగా జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకి ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీలను దూరంగా ఉంచాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోందట. రెండు నెలల పాటు తీరిక లేని క్రికెట్ ఆడిన నేపథ్యంలో వారికి విశ్రాంతిని ఇవ్వాలని చూస్తోందట.

అలసిపోయే ప్రమాదం:
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య షెడ్యూల్ ప్రకారం 12 రోజుల వ్యవధిలో ఈ మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఒకవేళ పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీలని ఆడిస్తే.. డిసెంబరు 17 నుంచి ప్రారంభంకానున్న నాలుగు టెస్టుల సిరీస్‌కి వారు అలసిపోయే ప్రమాదం ఉందని మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. ఒకవేళ ఎవరైనా గాయపడితే కీలక టెస్ట్ సిరీస్‌కి వారు దూరం కానున్నారు. టెస్టు జట్టులోకి బుమ్రా, షమీలతో పాటు ఫాస్ట్ బౌలర్లు ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ కూడా ఎంపికయ్యారు. గాయపడిన ఇషాంత్ శర్మ కూడా ఫిట్‌నెస్ సాధించిన నేపథ్యంలో.. చాలా మంది బౌలర్లు అందుబాటులో ఉన్నారు.

రొటేషన్ పద్ధతిలో:
టెస్ట్ సిరీస్‌కి చాలా మంది అందుబాటులో ఉన్నా.. ప్రయోగం చేసేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. దాంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నవదీప్ సైనీతో పాటు మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్‌లను ఆడించాలని చూస్తోందని సమాచారం. టెస్టు సిరీస్‌కి ముందే ఆసీస్ పరిస్థితులకి అలవాటు పడాలని అనుకున్నా.. రొటేషన్ పద్ధతిలో షమీ, బుమ్రాలకి అవకాశమివ్వాలని మేనేజ్‌మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

తొలిసారి టెస్టు సిరీస్ కైవసం:
2018-19 పర్యటనలో 2-1తో సిరీస్ గెలిచి ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ను కోహ్లీసేన కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంలో పుజారా కీలక పాత్ర పోషించాడు. మూడు సెంచరీలు బాది 500లకు పైగా పరుగులు సాధించాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా కూడా వికెట్లు పడగట్టాడు. అయితే తొలి టెస్ట్ అనంతరం విరాట్ కోహ్లీ భారత్ రానున్న విషయం తెలిసిందే. ఇది కాస్త కలవరపెట్టే అంశం. అయితే టీమిండియాకు పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉండడం ఊరటనిచ్చే అంశం.

టెస్టు సిరీస్ షెడ్యూల్:
# తొలి టెస్టు మ్యాచ్- డిసెంబరు 17 నుంచి- అడిలైడ్ ఓవెల్- డే/నైట్ టెస్టు
# రెండో టెస్టు మ్యాచ్- డిసెంబరు 26 నుంచి- మెల్‌బోర్న్
# మూడో టెస్టు మ్యాచ్ - జనవరి 7 నుంచి- సిడ్నీ
# నాలుగో టెస్టు మ్యాచ్ - జనవరి 15 నుంచి- గబ్బా
India vs Australia: పృథ్వీతో డ్యాన్స్.. ఇప్పటికీ ఈ లైలా నాకు పిచ్చెక్కిస్తూనే ఉంది: ధావన్
https://telugu.mykhel.com/cricket/india-vs-australia-shikhar-dhawan-dance-bollywood-song-with-prithvi-shaw-031642.html
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications