'ఈ ఏడాదిలో టెస్టు క్రికెట్‌కు బుమ్రా దొరికేశాడు'

మెల్‌బౌర్న్: ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమిండియా బౌలింగ్‌తో అదరగొట్టింది. ఇందులో ప్రత్యేకంగా జస్ప్రిత్ బుమ్రా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసి 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసీస్‌ను 151 పరుగులకే కట్టడి చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. బుమ్రా బౌలింగ్‌లో మార్కస్ హారిస్, షాన్ మార్ష్, ట్రావిస్ హెడ్, టిమ్ పైనె, నాథన్ లయన్, జోష్ హేజిల్ వుడ్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో ప్రదర్శనకు గాను బుమ్రా 39 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా పర్యటనల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. మొహమ్మద్ షమీతో పాటు లీడింగ్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు బుమ్రా. ఈ స్థాయి ప్రదర్శన చేసినందుకు సీనియర్ క్రికెటర్లతో పాటు.. నిపుణులంతా తమ శుభాకాంక్షలను ట్వీట్లలో తెలిపారు.
వీవీఎస్ లక్మణ్:
భారత్ అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకుంది. జస్ప్రిత్ బుమ్రా నుంచి ప్రత్యేకమైన ప్రదర్శన చూశాం. ఇరు జట్ల ప్లేయర్లలో బుమ్రానే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. నిజంగా బాగా ఆకట్టుకున్నాడు.
హర్షా బోగ్లే:
భారత్‌కు బుమ్రా ఓ సంపద లాంటి వాడు. చాలా చిన్న వయస్సు చాలా పరిణతితో ఉన్న బౌలర్.
వీరేందర్ సెహ్వాగ్:
ఆస్ట్రేలియా తలదన్నేందుకు పైన్‌ను అవుట్ చేశాడు. బుమ్రా ఈ ఏడాది బాగా సాధించాడు. భారత్ నుంచి చాలా గొప్ప కృషిని చూశాను. ఆసీస్‌ను 151 పరుగులకే ఆల్ అవుట్ చేశారు. మెల్‌బౌర్న్‌లో ఇదే వాతావరణం కొనసాగాలని కోరుకుంటున్నాను. మనవాళ్లు బ్రిలియంట్ క్రికెట్ ఆడారు.
మొహమ్మద్ కైఫ్:
జస్ప్రిత్ బుమ్రా ఎంతటి వ్యత్యాసం చూపించాడు. భారత ప్రదర్శనకు ఆస్ట్రేలియాకు మధ్య భారీ అంతరాన్ని ఉంచాడు. 292 పరుగుల ఆధిక్యం ఉండటమంటే దాదాపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చేజిక్కించుకున్నట్లుగానే ఉంది. ఆస్ట్రేలియాకు మరో అవకాశం ఇవ్వనవసర్లేదు.
క్రికెట్ వాలా:
ఎలాగైతే టెస్టు క్రికెట్‌కు ఈ ఏడాది బుమ్రా దొరికేశాడు. లంచ్ విరామానికి ముందు స్వింగింగ్ యార్కర్ వేసి షాన్ మార్ష్‌ను పడేశాడు. భారత్ గ్రేట్ సెషన్‌ను ఆడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications