నాలుగో వన్డే గెలిచినా... సంతృప్తి చెందని ఆస్ట్రేలియా కోచ్
హైదరాబాద్: బెంగళూరు వేదికగా భారత్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆసీస్ విజయం సాధించినప్పటికీ ఆ జట్టు చీఫ్ కోచ్ డేవిడ్ సాకర్‌కు మాత్రం ఆ విజయం పెద్దగా సంతృప్తి నివ్వలేదు. నాలుగో వన్డే అనంతరం ఇది ఆసీస్ జట్టు గొప్ప ప్రదర్శన ఎంతమాత్రం కాదనే అభిప్రాయాన్ని సాకర్ వ్యక్తం చేశాడు.
'ఆసీస్ గెలిచింది అంతే. అయితే ఇదేమంత గొప్ప ప్రదర్శనేం కాదు. కానీ మా పూర్తిస్థాయి ప్రదర్శన ఇది కాదు. ఇది మా గొప్ప ప్రదర్శనల్లో ఎంతమాత్రం ఒకటిగా నిలవదు. మేము 43 ఓవర్ వరకూ బాగా ఆడాం. కానీ మా ఇన్నింగ్స్ ముగింపు సరిగా లేదు. మేము అనుకున్న దానిని మాత్రం చేరలేకపోయాం. కాకపోతే మ్యాచ్ గెలవడంతో మా ఆటగాళ్లు ఆనందంగా ఉన్నారు' అని డేవిడ్ సాకర్ పేర్కొన్నాడు.

తమ బౌలింగ్ ఆరంభంలో తీవ్రంగా నిరాశపరిచిందని, చివర్లో మాత్రం బౌలర్లు ఆకట్టుకోవడంతో మ్యాచ్ గెలిచామని అన్నాడు. ప్రధానంగా స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్‌పై కోచ్ ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా భారత బ్యాట్స్‌మెన్‌ను నియంత్రించడంలో జంపా సఫలమయ్యాడని, జంపా వేసిన కొన్ని చక్కటి బంతులతో మ్యాచ్ తమ చేతుల్లోకి వచ్చిందని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications