For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia, Ist T20I: ప్రివ్యూ, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్

India vs Australia, Ist T20I: Preview, where to watch, timing, live streaming

హైదరాబాద్: వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా తన చివరి సిరిస్‌ను ఆడేందుకు సిద్ధమైంది. రెండు టీ20ల సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆదివారం విశాఖపట్నం వేదికగా తొలి టీ20 మ్యాచ్‌ ఆడనుంది. మొత్తానికి వరల్డ్‌కప్‌కు ముందు ఆఖరి సన్నాహకంగా భావిస్తున్న ఈ సిరీస్‌లో టీమిండియా ఏ మేరకు ప్రదర్శన చేస్తోందో ఆసక్తికరంగా మారింది. తుది జాబితాలో చోటు కోసం ఎదురుచూస్తున్న ఆటగాళ్లు ఈ సిరీస్‌లో సత్తా చాటాలని భావిస్తున్నారు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య దూరమైనా.. మూడు వారాల విశ్రాంతి తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ చేరికతో టీమిండియా మరింత బలంగా తయారైంది.

భారత్‌కు ఎలాంటి సమస్యలు లేనట్లే

భారత్‌కు ఎలాంటి సమస్యలు లేనట్లే

బ్యాటింగ్‌లో భారత్‌కు ఎలాంటి సమస్యలు లేనట్లే. ఆసీస్, న్యూజిలాండ్ పర్యటనల్లో ఈ ఇద్దరి ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్న చీఫ్ కోచ్ రవిశాస్త్రి కూడా మరోసారి నిశితంగా పరిశీలించనున్నాడు. ఓపెనింగ్‌లో రోహిత్‌, ధావన్‌ల జోడీకి తిరుగులేదు. వికెట్‌ కీపర్‌ ధోని మునుపటి ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆల్‌రౌండర్లు విజయ్‌ శంకర్‌, కృనాల్‌ పాండ్యా బ్యాటింగ్‌లో ఆకట్టుకోవడం జట్టుకు కలిసిరానుంది. వరల్డ్‌కప్ ముంగిట భారత్‌కు రెండు స్థానాల విషయంలో స్పష్టత రావాల్సింది.

ప్రత్యామ్నాయ ఓపెనర్‌‌గా కేఎల్ రాహుల్ క్లిక్ అయ్యేనా?

ప్రత్యామ్నాయ ఓపెనర్‌‌గా కేఎల్ రాహుల్ క్లిక్ అయ్యేనా?

అందులో ఓ స్థానం రిజర్వ్‌ వికెట్‌ కీపర్‌ కాగా.. మరొకటి ప్రత్యామ్నాయ ఓపెనర్‌. ఓపెనర్లు ధవన్, రోహిత్‌లను మార్చే అవకాశం లేకపోవడంతో ఈ సిరిస్‌లో కేఎల్ రాహుల్‌ను ఎక్కడ సర్దుబాటు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కొన్ని రోజుల కిందటి వరకు దినేశ్‌ కార్తీకే రెండో వికెట్‌ కీపర్‌ అనుకున్నారు. కానీ న్యూజిలాండ్‌ సిరీస్‌లో మెరుపులు మెరిపించిన యువ వికెట్‌ కీపర్‌ పంత్‌కి అవకాశమిచ్చిన సెలక్టర్లు కార్తీక్‌ ఆస్ట్రేలియాతో టీ20లకు మాత్రమే ఎంపిక చేశారు.

వన్డే సిరిస్‌కు దూరమైన దినేశ్ కార్తీక్

వన్డే సిరిస్‌కు దూరమైన దినేశ్ కార్తీక్

వన్డేలకు కార్తీక్‌కు ఎలాగూ అవకాశం ఇవ్వలేదు. కనీసం పొట్టి ఫార్మాట్‌లోనైనా కొనసాగిస్తారా లేక నాలుగో స్థానం రాహుల్‌కే కట్టబెడుతారా చూడాలి. ఈ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేయడం ద్వారా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని రిషబ్ భావిస్తున్నాడు. వెన్ను నొప్పితో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సిరీస్‌కు దూరంకావడం.. విజయ్ శంకర్‌కు అనుకోని వరంగా మారింది. బ్యాటింగ్‌లో శంకర్‌కు తిరుగులేకున్నా.. బౌలింగ్‌లోనే మరింత నిలకడ రావాల్సి ఉంది.

మయాంక్ మార్కండేకు చోటు దక్కడం అనుమానమే

మయాంక్ మార్కండేకు చోటు దక్కడం అనుమానమే

మరోవైపు ఈ సిరిస్ కేఎల్ రాహుల్‌కి అత్యంత కీలకం కానుంది. రాహుల్‌ విఫలమైతే.. కార్తీక్‌ అదనపు బ్యాట్స్‌మన్‌గా వరల్డ్‌కప్‌కు వెళ్తాడు. ఇక, బుమ్రా అందుబాటులోకి రావడంతో బౌలింగ్ బలం పటిష్టంగా ఉంది. ఉమేశ్ యాదవ్‌కు ఇది అద్భుత అవకాశం. ఇక్కడ సత్తా చాటితే వరల్డ్‌కప్ బెర్త్ ఖరారైనట్లే. యువ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే జట్టులో ఉన్నా తుది జట్టులో చోటు దక్కడం అనుమానమే. బుమ్రా, ఉమేశ్‌, కౌల్‌ పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నారు.

సొంతగడ్డపై ఎదురైన పరాభవానికి ఆసీస్ ప్రతీకారం తీర్చుకుంటుందా?

సొంతగడ్డపై ఎదురైన పరాభవానికి ఆసీస్ ప్రతీకారం తీర్చుకుంటుందా?

భారత్‌తో సిరీస్‌లో ఆస్ట్రేలియాకు చాలా లక్ష్యాలనే నిర్దేశించుకుంది. ముందుగా సొంతగడ్డపై ఎదురైన పరాభవానికి ఇక్కడ ప్రతీకారం తీర్చుకోవాలి. మరోవైపు ప్రపంచకప్‌ కోసం జట్టులో చాలా స్థానాలకు ఆటగాళ్లను ఖరారు చేసుకోవాలి. మరోవైపు స్మిత్, వార్నర్‌లాంటి స్టార్లు అందుబాటులో లేకపోవడంతో ఆసీస్ ప్రస్తుతం ఒత్తిడిలో కనిపిస్తోంది. ఇందులో భాగంగా బిగ్‌బాష్‌లో ఆడిన ఆరుగురు టాప్ ప్లేయర్లను జట్టులోకి తీసుకొచ్చారు.

తురుపు ముక్కలుగా షార్ట్‌, జే రిచర్డ్‌సన్

తురుపు ముక్కలుగా షార్ట్‌, జే రిచర్డ్‌సన్

బిగ్‌బాష్‌లో బ్యాటింగ్‌లో సత్తాచాటిన షార్ట్‌.. బౌలింగ్‌లో మెరిసిన జే రిచర్డ్‌సన్‌లను తురుపు ముక్కలుగా ఈ సిరిస్‌లో బరిలోకి దించుతోంది. మరోవైపు ఆరోన్ కెప్టెన్‌ ఫించ్‌ సహా చాలామంది ఆటగాళ్లు నిలకడ అందుకోవాల్సి ఉంది. మ్యాక్స్ స్టోయినిస్, కోల్టర్‌నీల్ పొట్టి ఫార్మాట్‌లో ఎప్పుడు ఎలా చెలరేగుతారో ఊహించడం కష్టం. మొత్తంగా ఎనిమిదో నంబర్ బ్యాట్స్‌మన్ వరకు భారీ హిట్టింగ్ చేయగల సమర్థులు జట్టులో ఉండటం ఆసీస్‌కు కలిసొచ్చే అంశం.

రాత్రి 7 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో 7

రాత్రి 7 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో 7

హాట్ స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్

Story first published: Sunday, February 24, 2019, 12:48 [IST]
Other articles published on Feb 24, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+