న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'టీమిండియా అదరగొట్టి.. కొత్త సంవత్సరాన్ని ఆస్వాదించండి'

India vs Australia: India Retain Border-Gavaskar Trophy in Melbourne, Twitter Raises Toast

మెల్‌బౌర్న్‌: టీమిండియా మరో సారి విజయం సాధించింది. మెల్‌బౌర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ క్రికెటర్లను మట్టికరిపించి 137 పరుగుల తేడాతో భారత్‌ గెలిచింది. అన్ని విభాగాల్లో రాణించి జట్టుగా గెలిచిన కోహ్లీసేనపై సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రికెట్‌ ప్రముఖులు, మాజీలు, ఇతరులు టీమిండియాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సిడ్నీ వేదికగా జరగాల్సిన నాలుగో టెస్టులోనూ విజయంతో రాణించాలని ప్రముఖులంతా కాంక్షిస్తూ.. ట్వీట్ల ద్వారా తెలిపారు.

'నలుగురు ప్రపంచస్థాయి టీమిండియా బౌలర్లు ఆసీస్‌ మీద విరుచుకుపడితే ఫలితం ఇలాగే ఉంటుంది. కంగ్రాట్స్‌ టీమిండియా'

'మెల్‌బోర్న్ మైదానంలో టీమిండియాకిది మర్చిపోలేని విజయం. గొప్పగా రాణించారు. సిడ్నీ టెస్టులోనూ ఇదే దూకుడు కొనసాగిస్తే భారత జట్టు చరిత్ర సృష్టిస్తుంది. జట్టులోని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు'

'ఆసీస్‌పై టీమిండియాకిది అసాధారణ విజయం.2-1 ఆధిక్యం అభినందనీయం. బుమ్రాది కీలక పాత్ర. అన్ని ఫార్మాట్లలో అతడిలాగే రాణించాలి.'

' ఇది చాలా గొప్ప విజయం. ఇందులో భాగమైనందుకు గర్వంగా ఉంది. సిడ్నీలోనూ ఇలాగే కొనసాగుతాం. జైహింద్‌'

'రికార్డు విజయంతో ఈ ఏడాదిని గొప్పగా ముగించుకున్నాం. ఈ విజయం ఊహించిందే. ఈ టెస్టు గెలవడం మా కల. విజయం సాధించడం గొప్ప కాదు. దాన్ని కొనసాగించాలి'

' టెస్టు మ్యాచ్ అంటే ఇది. ఈ విజయంలో మమ్మల్ని ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు. ఈ గొప్ప విజయంతో 2018ని ఘనంగా ముగించాం. సిడ్నీలో ఆ ఒక్కటీ సాధిస్తే మా లక్ష్యం పూర్తవుతుంది.'

'భారత జట్టుకిది గొప్ప విజయం. ముఖ్యంగా ఈ గెలుపు బౌలర్లది. ఈ గెలుపును చాలా కాలంపాటు గుర్తుంచుకోవాలి.'

' ఈ టెస్టులో టీమిండియా అదరగొట్టింది. కొత్త సంవత్సరాన్ని ఆస్వాదించండి.

'2-1ని టీమిండియా కచ్చితంగా 3-1గా మారుస్తుంది. కంగ్రాట్స్ టీమిండియా. మీ పట్ల ఎంతో గర్వంగా ఉంది'.

Story first published: Sunday, December 30, 2018, 15:51 [IST]
Other articles published on Dec 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X