Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోటోలు: ఆసీస్ పర్యటనకు ముందు ఎయిర్ పోర్ట్‌లో ఓ అభిమానితో కోహ్లీ

India Vs Australia: India cricketers chill out at airport before boarding flight to Oz - See Pics

హైదరాబాద్: సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన కోసం విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా శుక్రవారం ఆస్ట్రేలియాకు బయల్దేరింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది.

ఆసీస్ పర్యటన కోసం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత క్రికెటర్లు విమానం కోసం కాసేపు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలువురు అబిమానులు భారత క్రికెటర్లను కలిసి ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడంతో పాటు సెల్ఫీలు దిగారు.

పలువురు క్రికెటర్లు తమకెంతో ఇష్టమైన PUBG గేమ్‌ని ఆడారు. ఆ సమయంలో తీసిన బీసీసీఐ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అభిమానితో ఫోటోకో ఫోజు ఇస్తుండగా... కృనాల్ పాండ్యా, మనీష్ పాండేలు సీరియస్‌గా గేమ్ ఆడుతున్నారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సిరీస్‌ కోసం భారత సెలక్టర్లు ఇప్పటికే టీ20, టెస్టు జట్టుని ప్రకటించారు. నవంబర్ 21 నుంచి ఆరంభమయ్యే మూడు టీ20ల సిరిస్‌తో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సుదీర్ఘ పర్యటన ప్రారంభం కానుంది.

స్వదేశంలో విండిస్‌ను చిత్తుచేసిన టీమిండియా ఇప్పుడు ఆత్మ విశ్వాసంతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తోంది. ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్ సాధించని ఘనతను అందుకోవాలని విరాట్ కోహ్లీ ఉవ్విళ్లూరుతున్నాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు భారత్ ఒక్క టెస్ట్ సిరీస్‌ను కూడా గెలవలేదు.

ఫోటోలకు రోహిత్-దినేశ్ కార్తీక్ ఫోజు

ఫోటోలకు రోహిత్-దినేశ్ కార్తీక్ ఫోజు

ముంబై విమానాశ్రయంలో టీమిండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఫోటోలకు ఫోజులిస్తోన్న దృశ్యం.

అభిమానితో కోహ్లీ ఫోజు

అభిమానితో కోహ్లీ ఫోజు

ఆసీస్ పర్యటన కోసం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత క్రికెటర్లు విమానం కోసం కాసేపు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఓ అభిమానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫోజు ఇస్తోన్న దృశ్యం.

గేమ్ ఆడుతూ బిజీగా మనీష్-కృనాల్ పాండ్యా

గేమ్ ఆడుతూ బిజీగా మనీష్-కృనాల్ పాండ్యా

ఆసీస్ పర్యటన కోసం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత క్రికెటర్లు విమానం కోసం కాసేపు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలో కృనాల్ పాండ్యా, మనీష్ పాండేలు సీరియస్‌గా గేమ్ ఆడుతున్నారు.

కెమెరాకు ధావన్-బుమ్రా ఫోజు

కెమెరాకు ధావన్-బుమ్రా ఫోజు

విమానాశ్రయం లాంఛ్‌లో పక్కపక్కనే కూర్చున్న ధావన్-బుమ్రా.

కుల్దీప్ యాదవ్

ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ముంబై విమానాశ్రయంలో దిగిన ఫోటోని కుల్దీప్ యాదవ్ అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటోలో రిషబ్ పంత్, రోహిత్ శర్మ తదితరులను చూడొచ్చు.

కృనాల్ పాండ్యా

టీమిండియా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఇలా... జట్టులోని సహాచర క్రికెటర్లు అయిన మనీష్ పాండే, వాషింగ్టన్ సుందర్, రోహిత్ శర్మలను ఇక్కడ చూడొచ్చు.

జస్ప్రీత్ బుమ్రా

ఆస్ట్రేలియా పర్యటకు వెళ్లే క్రమంలో విమానం సీట్‌లో టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా థమ్స్ అప్ సింబల్ చూపిస్తోన్న దృశ్యం.

Story first published: Friday, November 16, 2018, 17:51 [IST]
Other articles published on Nov 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+