బీసీసీఐ కీలక నిర్ణయం: టీ20 సిరిస్ జరుగుతున్నా... సిడ్నీకి బ్యాటింగ్ కోచ్

హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బుధవారం నుంచి మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో మధ్యాహ్నాం 1,20 గంటలకు తొలి టీ20 ప్రారంభం కానుంది. అయితే, తొలి టీ20కి ముందు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌ను జట్టు మేనేజ్‌మెంట్ సిడ్నీకి పంపింది.
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ డిసెంబర్ 6న అడిలైడ్ వేదికగా జరిగే టెస్టుతో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌లకు బ్యాటింగ్‌లో సాయం చేసేందుకు గాను జట్టు మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటివరకు టీమిండియా ఒక్క టెస్టు సిరిస్‌ను కూడా గెలవలేదు. దీంతో ఈసారి ఎలాగైనా టెస్టు సిరిస్‌ను నెగ్గి చరిత్ర సృష్టించాలని కోహ్లీసేన ఊవిళ్లూరుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు లేకపోవడం కూడా టీమిండియాకు కలిసిరానుంది.

సిడ్నీకి సంజయ్ బంగర్
ఆసీస్‌తో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చోటు దక్కించుకున్న యువ ఆటగాళ్లు పృథ్వీ షా, హనుమ విహారిలకు సిడ్నీలో రాబోయే ఐదు రోజుల్లో సంజయ్ బంగర్ బ్యాటింగ్‌లో సాయం చేయనున్నాడు. "టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ లాజిస్టిక్స్ మేనేజర్ నువాన్‌తో కలిసి సిడ్నీకి వెళ్లారు. న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్లు ఇప్పటికే సిడ్నీకి చేరుకున్నారు. నవంబర్ 28న జరిగే ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌కి వారిని సంజయ్ బంగర్ ట్రైన్ చేయనున్నారు" అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.

కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ
టీ20ల్లో ఎవరైతే ఆడటం లేదో వారిని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. "పృథ్వీ షా, హనుమ విహారికి ఇదే తొలి ఆస్ట్రేలియా పర్యటన. నవంబర్ 25 వరకు వీరిద్దరూ సంజయ్ బంగర్ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకుంటారు. వీరిద్దరితో పాటు అజ్యింకె రహానే, మురళీ విజయ్, పార్ధీవ్ పటేల్ కూడా శిక్షణ పొందుతారు" అని తెలిపారు.

సీనియర్లతో కలిసి రవిశాస్త్రి
మరోవైపు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మూడు టీ20ల సిరిస్‌లో బాగంగా సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో కలిసి ప్రయాణం చేయనున్నారు. ఆస్ట్రేలియా పరిస్థితులకు కొత్తగా జట్టులో చోటు దక్కించుకున్న షా, విహారి అలవాటు పడేందుకు జట్టు మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది" అని తెలిపారు.

మరి కొన్ని రోజుల తర్వాత సిడ్నీకి షమీ, శర్మ
టెస్టులో జట్టుకు ఎంపికైన మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ మరి కొన్ని రోజుల తర్వాత సిడ్నీకి చేరుకోనున్నారు. అనంతరం న్యూ సౌత్ వేల్స్ గ్రేడ్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాకు చెందిన పలువురు దేశవాళీ బౌలర్లతో కలిసి వీరిద్దరూ టీమిండియా టెస్టు బ్యాట్స్‌మెన్లు నెట్ సెషన్‌లో పాల్గొంటారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications