గబ్బాలో భారత్‌కు కష్టమే.. గెలిస్తే మాత్రం చరిత్రే! రోహిత్ పైనే ఆశలు!

బ్రిస్బేన్‌: బోర్డర్-గవాస్కర్ సిరీస్ తుది దశకు చేరింది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగో టెస్ట్‌లో చివరి రోజు ఆటనే మిగిలిపోయింది. ప్రస్తుతానికి ఇరు జట్లను విజయం ఊరిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌ 33 పరుగుల ఆధిక్యంతో కలిపి ఓవరాల్‌గా 328 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు టీమిండియా ముందుంచింది.

అయితే, ఆఖరి రోజు ఆటలో అత్యుత్తమ ఆసీస్ బౌలింగ్ దళాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం ఇప్పుడు రహానే సేన ముందున్న సవాల్. తొలి ఇన్నింగ్స్‌లో టాప్‌, మిడిల్‌ ఆర్డర్‌ విఫలమైనా లోయర్‌ ఆర్డర్‌ రాణించడంతో భారత్‌ పోటీలో నిలిచింది. లేదంటే ఇప్పుడున్న టార్గెట్‌ కంటే మరో సెంచరీ పరుగుల లక్ష్యం మన ముందుండేది.

శార్దూల్, సుంధర్ రాణించడంతో..

శార్దూల్, సుంధర్ రాణించడంతో..

వాషింగ్టన్‌ సుందర్‌ (144 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్‌), శార్దూల్‌ ఠాకూర్‌ (115 బంతుల్లో 67; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇద్దరూ ఏడో వికెట్‌కు విలువైన 123 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఫలితంగా భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే. దాంతో ఆసీస్‌‌ స్పల్ప ఆధిక్యాన్నే అందుకుంది.

ఆసీస్‌ అద్భుత రికార్డు..

ఆసీస్‌ అద్భుత రికార్డు..

గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాకు గొప్ప రికార్డు ఉంది. ఈ మైదానంలో ఆసీస్‌ ఇప్పటి వరకు 55 టెస్టులు ఆడగా.. 33 మ్యాచుల్లో విజయం సాధించింది. 13 టెస్టులను డ్రా చేసుకుంది. 8 మ్యాచుల్లో మాత్రమే ఓడిపోయింది. ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది. ఇక 1988లో వెస్టిండీస్‌తో పరాజయం తర్వాత ఇప్పటివరకు అక్కడ ఒక్క టెస్టులో కూడా ఆసీస్‌ ఓడిపోలేదు. మరోవైపు ఈ మైదానంలో భారత్ ఒక్క విజయాన్ని కూడా అందుకోలేదు.

ఛేజింగ్ రికార్డు 236..

ఛేజింగ్ రికార్డు 236..

గబ్బాలో ఇప్పటివరకు అత్యధిక ఛేజింగ్‌ స్కోరు 236 పరుగులే. 1951/52 లో ఆతిథ్య ఆసీస్‌ విధించిన 236 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ ఛేదించి విజయం సాధించింది. అనంతరం 1975/76 లో మళ్లీ వెస్టండీస్‌ పైన ఆస్ట్రేలియా 219 టార్గెట్‌ ఛేదించింది. 1982/83 లో ఇంగ్లండ్‌పై ఆసీస్‌ 188 పరుగుల్ని ఛేదించింది. 1978/79లో 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లండ్‌ ఆస్ట్రేలియాపై గెలుపొందింది. 2017/18లో ఆసీస్‌ 170 పరగుల టార్గెట్‌ ఛేదించి ఇంగ్లండ్‌పై గెలిచింది. ఈ రికార్డులను పరిశీలిస్తే భారత్‌ ముందున్న 328 పరుగుల లక్ష్యాన్ని చేధించడం కష్టమే.

వ్యూహాలతో రావాలి..

వ్యూహాలతో రావాలి..

ఇంకా 324 పరుగులే వెనుకంజలో ఉన్న భారత్ ఈ మ్యాచ్ గెలవాలంటే అద్భుత ప్రదర్శన కనబర్చాల్సిందే. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రహానేలలో ఒక్కరైనా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిందే. ముఖ్యంగా రోహిత్ శర్మ శతకంతో చెలరేగితో భారత్ విజయం నల్లేరు మీద నడకే. అయితే ఆఖరి రోజు భారత్ కొన్ని వ్యూహాత్మక అడుగులు వేయాలని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్లాన్-ఏ, ప్లాన్-బీతో బరిలోకి దిగాలని సూచిస్తున్నారు. గెలుపు కోసం ముందుగా ధాటిగా ఆడే బ్యాట్స్‌మెన్‌కు ప్రమోషన్ ఇవ్వాలని ప్రతికూల పరిస్థితులుంటే మాత్రం.. డ్రా కోసం ప్రయత్నించాలంటున్నారు.

ఇందు కోసం ఈ పర్యటనలో దారుణంగా విఫలమైన పుజారను డీమోషన్ చేయాలంటున్నారు. అతని జిడ్డు బ్యాటింగ్ కొంత వరకు జట్టు లాభం చేస్తున్నా.. ఇతర బ్యాట్స్‌మెన్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రోహిత్ వికెట్ ఇచ్చుకునేలా చేసిందంటున్నారు. అతని స్థానంలో మయాంక్‌ను పంపించి.. ఆరో స్థానంలో పుజారాను పంపించాలంటున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Monday, January 18, 2021, 17:03 [IST]
Other articles published on Jan 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X