For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అవగాహన వచ్చింది: డీఆర్ఎస్‌ తప్పుని తనపై వేసుకున్న హ్యాండ్స్‌‌కోంబ్‌

డ్రెస్సింగ్‌ రూమ్ సలహా తీసుకోవాలని తానే కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు చెప్పానని తప్పును తనపై వేసుకున్న ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్‌ పీటర్‌ హ్యాండ్స్‌ కోంబ్‌కు ఇప్పుడు డీఆర్ఎస్‌పై పూర్తి అవగాహన .

By Nageshwara Rao

హైదరాబాద్: బెంగుళూరు టెస్టులో డ్రెస్సింగ్‌ రూమ్ సలహా తీసుకోవాలని తానే కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు చెప్పానని తప్పును తనపై వేసుకున్న ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్‌ పీటర్‌ హ్యాండ్స్‌ కోంబ్‌కు ఇప్పుడు అంఫైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్‌)పై పూర్తి అవగాహన వచ్చిందని చెప్పుకొచ్చాడు.

'నేను నా అంతర్జాతీయ కెరీర్‌ ఆరంభ దశలో ఉన్నాను. డీఆర్‌ఎస్‌తో ఇప్పటి వరకు పెద్దగా పని పడలేదు. దానిని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను. అలా చేయకూడదని నాకు అస్సలు తెలీదు. ఈ ఘటనతో తెలిసొచ్చింది. దీనిని ఇక్కడితో ముగించి ముందుకు సాగాలని కోరుకుంటున్నా' అని హ్యాండ్స్‌ కోంబ్‌ ట్వీట్‌ చేశాడు.

India Vs Australia: I am lot more familiar with DRS now, says PeterHandscomb

స్టీవ్‌ స్మిత్‌ ఓ ప్రణాళిక ప్రకారమే డ్రెస్సింగ్‌ రూమ్ నుంచి సలహాలు పొందుతున్నాడన్న టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి ఆరోపణలపై ఆస్ట్రేలియా జట్టు సహాయక కోచ్‌ డేవిడ్‌ సాకేర్‌ స్పందించాడు. మైదానంలో నుంచి స్టీవ్ స్మిత్‌ చేసిన సైగ స్వయంగా తాము కూడా నిర్ఘాంతపోయేలా చేసిందని ఆయన వ్యాఖ్యానించాడు.

'నిజానికి స్మిత్‌ బాల్కనీ వైపు చూసినప్పుడు మేమందరం షాక్‌కు గురయ్యాం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదు. కోహ్లీ ఆరోపించినట్లు రివ్యూ కోసం సైగలు రూపొందించుకొని ఉంటే డేవిడ్‌ వార్నర్‌, షాన్‌ మార్ష్‌ల విషయంలో తప్పు చేసేవాళ్లం కాదు కదా. అంతకు ముందు కూడా మేం ఇలా చేశామనే కోహ్లీ ఆరోపణను మాత్రం ఖండిస్తున్నా. మమ్మల్ని మోసగాళ్లు అని కోహ్లి రెచ్చగొట్టే వాఖ్యలు చేశాడు. ఈ వివాదంలో ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యపరిచింది'' అని సాకేర్‌ అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+