
మెల్‌బోర్న్: భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌కి ఆదివారం వరుణుడు అంతరాయం కలిగించాడు. ఆ కొద్దిసేపటికే ఆసీస్‌తో బాక్సింగ్ డే టెస్ట్‌లో తొలి విజయం నమోదు చేసి చరిత్ర సృష్టించింది. రెండో టెస్టులో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. 399 పరుగుల భారీలక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు భారత్ బౌలర్ల దాటికి కుదేలైంది. ఏకంగా 137 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ గెలుపుతో భారత్ నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సాధించింది.
వర్షం కారణంగా మ్యాచ్ రెండు గంటలు ఆలస్యమైనప్పటికీ విజయం వరించడానికి మాత్రం ఎంతోసేపు పట్టలేదు. బుధవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ని 443/7తో డిక్లేర్ చేయగా.. అనంతరం ఆస్ట్రేలియా టీమ్ 151 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. దీంతో.. 292 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌ని 106/8తో డిక్లేర్ చేసింది. అయితే.. మ్యాచ్‌లో మూడోరోజే భారత్‌కి 292 పరుగుల భారీ ఆధిక్యం లభించినా.. కంగారూలని ఫాలోఆన్ ఆడించకుండా భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పొరపాటు చేశాడనే అభిప్రాయాలు వినిపించాయి.
258/8 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన కొద్దిసేపటికే కమిన్స్ (63), లయన్ (7) ఔటవ్వడంతో భారత్ విజయం లాంచనమైంది. భారత బౌలర్లలో బుమ్రా, జడేజా మూడేసి.. షమీ, ఇషాంత్ రెండేసి వికెట్లు తీశారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయంతో బోర్డర్- గవాస్కర్ ట్రోఫీని భారత్ నిలబెట్టుకున్నట్లైంది.
ప్యాట్ కమిన్స్ అద్భుత హాఫ్ సెంచరీతో విజయం కోసం భారత్ చివరి రోజు వరకు నిరీక్షించాల్సి వచ్చింది. చివరి రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. మరో మూడు పరుగుల్లోనే చివరి రెండు వికెట్లు కోల్పోయింది. కమిన్స్‌ను బుమ్రా ఔట్ చేయగా.. నాథన్ లయన్‌ను ఇషాంత్ శర్మ పెవిలియన్‌కు చేర్చడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో బాక్సింగ్ డే టెస్ట్ భారత్ వశమైంది.