బాక్సింగ్ డే టెస్టులో విజయమెవరిదో!: భారత్‌కు 2 వికెట్లు.. ఆసీస్‌కు 141 రన్స్


హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్ విజయానికి రెండు వికెట్ల దూరంలో నిలిచింది. నాలుగోరోజే విజయం సాధించాలన్న భారత్ ఆశలపై ఆసీస్ బౌలర్లు పాట్ కమ్మిన్స్, నాథన్ లియాన్ నీళ్లు చల్లారు. వీరి వికెట్ల కోసం ఎన్ని వ్యూహాలు.. బౌలర్లను మార్చినా అవకాశం ఇవ్వలేదు.
మ్యాచ్ ఫలితం కోసం అంపైర్లు ఆటను అరగంట పొడిగించినా ఈ టెయిలండర్ జోడీ భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. వీరిద్దరూ ఇప్పటికే 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆటలో నాలుగో రోజైన శనివారం 399 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 258/8తో ఓటమి అంచున ఉంది.
హాఫ్ సెంచరీ సాధించిన కమ్మిన్స్
ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కమ్మిన్స్ 9 వికెట్లు తీసిన కమ్మిన్స్ బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించాడు. మొత్తం 103 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించిన కమ్మిన్స్ (61 బ్యాటింగ్) భారత్ విజయాన్ని ఐదో రోజుకు వాయిదా వేశాడు. అతనికి నాథన్ లియాన్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
భారత్ గెలుపు లాంఛనమే
అయితే ఆ జట్టు విజయానికి ఇంకా 141 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉండటంతో ఆదివారం భారత్ గెలుపు లాంఛనంగానే కనిపిస్తోంది. భారత బౌలర్లలో జడేజా మూడు, షమీ 2, బుమ్రా 2 వికెట్లు తీయగా ఇషాంత్ ఒక వికెట్ పడగొట్టాడు.
106/8 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్
ఆటలో భాగంగా నాలుగో రోజైన శనివారం ఓవర్ నైట్ స్కోరు 54/5తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియా 106/8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 292 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం 399 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ముందు ఉంచింది. శనివారం తొలి సెషన్‌లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (42), రిషబ్ పంత్ (33) ఫరవాలేదనిపించారు.
ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ
టీమిండియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తలిగింది. ఈ టెస్టు సిరిస్‌లో పేలవ ప్రదర్శన చేస్తోన్న ఓపెనర్ ఆరోన్ ఫించ్(3) మరోసారి ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం మరో ఓపెనర్ హారిస్ (13) స్పిన్నర్ జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు.
33 పరుగులకే ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి ఆసీస్
దీంతో జట్టు స్కోరు 33 పరుగులకే ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజా (33) కూడా మహ్మద్ షమీ బౌలింగ్‌లో జట్టు స్కోరు 63 వద్ద వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాన్ మార్ష్(44), ట్రావిస్ హెడ్(34), మిచెల్ మార్ష్(10), టిమ్ పైనీ(26), మిచెల్ స్టార్క్(18) దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్లు చేజార్చుకున్నారు. చివర్లో స్టార్క్ (18), లయన్(6 నాటౌట్)లతో కలిసి కమిన్స్ 82 పరుగులు జోడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications