పెర్త్‌లో రెండో టెస్టు: ముగిసిన రెండో రోజు, ఆసీస్ 326 ఆలౌట్, భారత్ 172/3


హైదరాబాద్: పెర్త్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగుస్తోంది. కోహ్లీ, రహానే హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 69 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (82), రహానే (51) పరుగులతో ఉన్నారు.
రహానే-కోహ్లీల జోడీ 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా భారత జట్టు 154 పరుగుల వెనుకంజలో ఉంది. దీంతో మూడో రోజు ఆట కీలకం కానుంది. ఇక, రెండో రోజు ఆటలో తొలి రెండు సెషన్లు ఇరు జట్లు సమంగా నిలిచినప్పటికీ. ఆఖరి సెషన్‌లో భారత్‌దే పూర్తి ఆధిపత్యంగా సాగింది.
భారత్‌ను త్వరగా ఔట్ చేసి ఒత్తిడిలోకి నెట్టేయాలని ఆసీస్ భావిస్తుండగా, ఎలాగైనా క్రీజులో నిలబడి మ్యాచ్‌పై పట్టు సాధించాలని భారత్ భావిస్తోంది. ఆటలో రెండో రోజైన శనివారం ఓవర్‌నైట్ స్కోరు 277/6తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టులో టిమ్ పైన్ (38), పాట్ కమిన్స్ (19) క్రీజులో నిలిచి ఓ గంటపాటు భారత్ బౌలర్లని పరీక్షించారు.
జట్టు స్కోరు 310 వద్ద పాట్ కమిన్స్‌ని ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయగా.. తర్వాత ఓవర్‌లోనే టిమ్‌పైన్‌ని బుమ్రా బోల్తా కొట్టించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 326 ఆలౌట్
ఆ తర్వాత మిచెల్ స్టార్క్ (6), జోష్ హేజిల్‌వుడ్ (0)లను వరుస బంతుల్లో ఇషాంత్ శర్మ పెవిలియన్‌కు చేర్చడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కి తెరపడింది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ నాలుగు వికెట్లు తీయగా, బూమ్రా, ఉమేష్ యాదవ్, హనుమ విహారిలు తలో రెండు వికెట్లు తీశారు. ఆనంతరం భారత్ బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టుకు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. మూడో ఓవర్‌లోనే మురళీ విజయ్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆఫ్ స్టంప్‌ని లక్ష్యంగా చేసుకుని మిచెల్ స్టార్క్ బంతిని విసరగా మురళీ విజయ్ డకౌట్‌గా వెనుదిరిగాడు.

నిరాశ పరిచిన ఓపెనర్లు
ఆ తర్వాత కొద్ది సేపటికే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (2) పరుగులకే ఔటై నిరాశపరిచాడు. దీంతో టీమిండియా 8 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకుంది. ఆ తర్వాత క్రీజులో వచ్చిన పుజారా(24), విరాట్ కోహ్లీ(41) భారత్‌ను ఆదుకున్నారు. నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని నడిపించారు. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టేందుకు యత్నించారు. దీంతో టీ విరామ సమయానికి వీరిద్దరూ 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
రహానేతో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ ముందుకు
టీ విరామం అనంతరం భారత జట్టు పుజారా రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ 39వ ఓవర్ రెండో బంతికి పుజారా (24) టిమ్ పైన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పుజారా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రహానేతో కలిసి కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 109 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 50 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెస్టు కెరీర్‌లో కోహ్లీకి ఇది 20వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.
టెస్టుల్లో రహానేకు 17వ హాఫ్ సెంచరీ
అనంతరం వీరి జోడీని విడదీసేందుకు గాను ఆతిథ్య బౌలర్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ అది సాధ్యపడలేదు. మరో వికెట్ పడకుండా రహానె, కోహ్లీ జాగ్రత్తగా ఆడారు. ఈ మ్యాచ్‌లో తొలుత ఎదురుదాడికి దిగిన రహానె తర్వాత నెమ్మదిగా ఆడాడు. అదే క్రమంలో రహానే కూడా 100 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో రహానేకి ఇది 17వ హాఫ్ సెంచరీ. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ రెండు వికెట్లు తీయగా, హేజిల్‌వుడ్‌కు ఒక వికెట్ లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications