For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెర్త్‌లో రెండో టెస్టు: తొలిరోజు పడిలేచిన భారత్‌, ఆస్ట్రేలియా 277/6

India vs Australia 2nd Test DAY 1 Highlights : Australia 277/6 At Stumps | Oneindia Telugu
India vs Australia Highlights, 2nd Test Day 1: Australia 277/6 At Stumps On Day 1 In Perth

హైదరాబాద్: పెర్త్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఓపెనర్ మార్కస్ హారిస్(70), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్(58), ఆరోన్ ఫించ్(50) హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 277/6 స్థితిలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ టిమ్ పైన్(16), ప్యాట్ కమ్మిన్స్(11) పరుగులతో ఉన్నారు.

భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ, హనుమ విహారి చెరో రెండు వికెట్లు తీసుకోగా... జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు.

హ్యారిస్‌ను పెవిలియన్‌కు పంపిన విహారి

ఆ తర్వాత మరో 30 పరుగుల వ్యవధిలో ఉస్మాన్ ఖవాజా (5) నిష్క్రమించడంతో జట్టు స్కోరు 130 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 46వ ఓవర్ ఆఖరి బంతికి ఉస్మాన్ ఖవాజా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులో పాతుకుని భారీ స్కోరు దిశగా సాగుతున్న మార్కస్ హ్యారిస్‌(70)ను హనుమ విహారి పెవిలియన్‌కు పంపాడు.

రహానే సూపర్ క్యాచ్

ఇన్నింగ్స్ 49 ఓవర్లో హనుమ విహారి వేసిన రెండో బంతిని అమాంతం గాల్లోకి లేపడంతో అక్కడే ఉన్న రహానే దానిని చక్కటి క్యాచ్‌గా అందుకున్నాడు. దీంతో టీ విరామానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. టీ విరామం అనంతరం ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో పీటర్ హ్యాండ్స్ కోంబ్ (7) పరుగుల వద్ద విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

తొలిరోజు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచిన కోహ్లీ క్యాచ్

దీంతో జట్టు స్కోరు 148 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. పీటర్ హ్యాండ్స్ కోంబ్ క్యాచ్ వీడియో మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 55వ ఓవర్ తొలి బంతిని పీటర్ హ్యాండ్స్ కోంబ్ థర్డ్ మ్యాన్ దిశగా హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి స్లిప్‌లోకి దూసుకెళ్లగా.. మెరుపు వేగంతో స్పందించిన విరాట్ కోహ్లీ కుడి చేత్తో అమాంతం గాల్లోకి ఎగిరి క్యాచ్‌గా అందుకున్నాడు.

మార్ష్‌తో కలిసి స్కోరు బోర్డుని నడిపించన హెడ్

ఆ తర్వాత షాన్ మార్ష్ (45)తో కలిసి నిలకడగా ఆడుతూ ట్రావిస్ హెడ్ ఆసీస్ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. అయితే జట్టు స్కోరు 232 పరుగుల వద్ద షాన్ మార్ష్ హనుమ విహారి బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ 70 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో ట్రావిస్ హెడ్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ.

ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ

అడిలైడ్ టెస్టు కూడా ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో ట్రావిస్ హెడ్‌(58) ఇన్నింగ్స్ 83వ ఓవర్లో ఇషాంత్‌ వేసిన బంతిని షమీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్(16), కమ్మిన్స్(11)తో కలిసి వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.

నలుగురు పేసర్లతో బరిలోకి భారత్

ఈ మ్యాచ్‌లో పర్యాటక టీమిండియా జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడిన అశ్విన్, రోహిత్ స్థానాల్లో ఉమేష్ యాదవ్, హనుమ విహారి తుది జట్టులోకి వచ్చారు. పెర్త్ పిచ్ పేస్, బౌన్స్‌కు అనుకూలించేది కావడంతో స్పిన్నర్ లేకుండా మొత్తం నలుగురు పేస్ బౌలర్లతోనే భారత్ బరిలోకి దిగింది.

1
43624
Story first published: Friday, December 14, 2018, 16:13 [IST]
Other articles published on Dec 14, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+