అడిలైడ్ టెస్టు, ముగిసిన డే2: ఆస్ట్రేలియా 191/7.. భారత్ ఆధిక్యం 59

హైదరాబాద్: అడిలైడ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు చెలరేగారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్(61), మిచెల్ స్టార్క్ (8) పరుగులతో క్రీజులో ఉన్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా ఆస్ట్రేలియా 59 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 250 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఓవర్‌నైట్ స్కోరు 250/9 పరుగులతో రెండోరోజైన శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా పరుగులేమీ చేయకుండానే షమీ(6) రూపంలో చివరి వికెట్‌ను కోల్పోయింది.
అనంతరం ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన
అనంతరం ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆతిథ్య జట్టుపై టీమిండియా బౌలర్లు చెలరేగారు. పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ ఆరోన్ ఫించ్ వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్ మూడో బంతికి ఫించ్ బౌల్డ్ కావడంతో ఆసీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్కస్ హారిస్-ఉస్మాన్ ఖవాజాల జోడి స్కోరు బోర్డుని నడిపిస్తున్నారు.
రెండో వికెట్‌కు 45 పరుగులు
వీరిద్దరూ కలిసి 45 పరుగులు జోడించిన తర్వాత హారిస్(26) రెండో వికెట్‌గా అశ్విన్ బౌలింగ్‌లో మురళీ విజయ్‌కు క్యాచ్ ఇచ్చి హారిస్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత స్పల్ప వ్యవధిలోనే షాన్ మార్ష్(2)ని అశ్విన్ పెవిలియన్‌కు చేర్చడంతో ఆస్ట్రేలియా 59 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
87 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
ఆ తర్వాత మరో 28 పరుగుల వ్యవధిలోనే ఉస్మాన్ ఖవాజా(28) కూడా అశ్విన్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో ఆస్ట్రేలియా 87 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి దిగిన పీటర్ హ్యాండ్‌స్కాంబ్-ట్రావిస్ హెడ్‌ల జోడీ నిలకడగా ఆడటంతో తిరిగి ఆస్ట్రేలియా గాడిలో పడింది.
టీ విరామానికి నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్
టీ విరామానికి నాలుగు వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. టీ విరామం అనంతరం ఇషాంత్, బుమ్రా చెలరేగడడంతో ఆసీస్ స్కోరు 120 పరుగుల వద్ద ఉండగా హ్యాండ్‌స్కాంబ్ ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత ఆసీస్ కెప్టెన్ పైన్ కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో ట్రావిస్ హెడ్‌తో జత కలిసిన ప్యాట్ కమ్మిన్స్ ఇన్నింగ్స్‌ను చక‍్కదిద్దే ప్రయత్నం చేశాడు.
ఎల్బీగా పెవిలియన్‌కు చేరిన బుమ్రా
వీరిద్దరి జోడీ 50 పరుగుల జత చేసిన తర్వాత కమ్మిన్స్‌ను బుమ్రా ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో ఆస్ట్రేలియా 177 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను చేజార్చుకుంది. ఒకవైపు ఆసీస్ వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకున్నా ట్రావిస్ హెడ్ మాత్రం హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు సాధించగా, బూమ్రా, ఇషాంత్‌లు తలో రెండు వికెట్లు తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications