Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అడిలైడ్ మైదానంలో పచ్చిక ఉంచేయడానికి కారణం?

India vs Australia 2018,1st test : Why The Curator Promises To Leave Some Grass In The Adilaide
India vs Australia: Green pitch expected at Adelaide as curator promises to leave some grass for first Test

అడిలైడ్‌: టీమిండియాతో తలపడనున్న తొలి టెస్టుకు రంగం చేస్తుంది ఆస్ట్రేలియా జట్టు. మైదానం సైతం సీమర్లకు అనుకూలంగా ఉండేలా సిద్ధం చేస్తోంది. ప్రస్తుత ఆసీస్ జట్టుతో పోల్చుకుంటే భారత్‌లో హిట్టర్లు దూకుడుగా ఉండడం ఇందుకు ఓ కారణమనే చెప్పాలి. ఈ క్రమంలో భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు జరిగే అడిలైడ్‌ పిచ్‌పై కాస్త పచ్చికను అలాగే ఉంచనున్నట్టు క్యురేటర్‌ డామియెన్‌ హగ్‌ తెలిపాడు.

 పగటి పూట ఇలా అవసర్లేదు

పగటి పూట ఇలా అవసర్లేదు

గతంలో ఇక్కడ మూడు డే అండ్‌ నైట్‌ టెస్టులు జరిగాయి. ఈ తరహా మ్యాచ్‌ల్లో గులాబీ బంతి దెబ్బతినకుండా పిచ్‌పై అదనపు పచ్చిక పొరను అలాగే ఉంచడం సహజంగా జరిగేది. అయితే భారత్‌ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో టెస్టు ఆడేందుకు సుముఖంగా లేకపోవడంతో ఈ టెస్టు డే మ్యాచ్‌గానే జరుగుతుంది. కానీ ఎరుపు బంతితో జరిగే ఈ మ్యాచ్‌కు కూడా క్యురేటర్‌ పిచ్‌ను అలాగే ఉంచాలని భావిస్తున్నాడు. ఎరుపు బంతితో ఆడే పగటి పూట టెస్టుకు ఇలా అవసరం లేదు.

చక్కటి సమన్వయం ఉండాలంటే

చక్కటి సమన్వయం ఉండాలంటే

‘గతానికి భిన్నంగా ఏమీ చేయడం లేదు. ఎప్పటిలాగే సన్నద్ధం చేస్తున్నాం. కవర్లు ముందుగా తొలగించి ఆటను ముందుగా ఆరంభించడమే ప్రస్తుత మార్పు. షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీల్లో ఎర్ర, గులాబీ బంతులతో ఆడే మ్యాచ్‌లకు ఇలాగే సిద్ధం చేస్తాం. బ్యాట్‌కు బంతికి మధ్య చక్కటి సమన్వయం ఉండాలంటే పిచ్‌పై ఇలా పచ్చిక ఉంచడమే కరెక్ట్‌' అని పిచ్‌ క్యూరేటర్‌ డేమియన్‌ హఫ్‌ పేర్కొన్నారు.

సీమర్లకు పిచ్‌ అనుకూలించే అంశం

సీమర్లకు పిచ్‌ అనుకూలించే అంశం

రెండేళ్లుగా ఆస్ట్రేలియాలో పర్యటించే ప్రతి జట్టు అడిలైడ్‌లో గులాబి బంతితో డే/నైట్‌ టెస్టు ఆడుతున్నాయి. కోహ్లీసేనను సైతం గులాబి బంతితో ఆడించాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా కోరగా బీసీసీఐ తిరస్కరించింది పిచ్‌పై తొలి డే/నైట్‌ టెస్టు మూడు రోజుల్లో, రెండోది నాలుగు రోజుల్లో, మూడోది ఐదో రోజు తొలి సెషన్‌లో ముగిశాయి. పిచ్‌పై పచ్చిక అదనంగా ఉంటే ఇరు జట్ల సీమర్లకు ఈ పిచ్‌ అనుకూలించే అవకాశం ఉంది. ఆసీస్‌లో పొడగరి, బలమైన పేసర్లు ఉంటారన్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, December 3, 2018, 9:51 [IST]
Other articles published on Dec 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+