స్విచ్‌హిట్‌తో 100 మీటర్ల సిక్స్.. మ్యాక్స్‌వెల్‌ షాట్ చూస్తే షాకే!! నిబంధనలకు లోబడే!

కాన్‌బెర్రా: ఐపీఎల్ 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్‌ గ్లెన్ మాక్స్‌వెల్‌.. దారుణంగా విఫలమయిన విషయం తెలిసిందే. 13 మ్యాచ్‌లు ఆడి ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. అయితే టీమిండియాతో ఆస్ట్రేలియా గడ్డపై ముగిసిన వన్డే సిరీస్‌లో మాత్రం రెచ్చిపోయి ఆడాడు. భారీ సిక్సుల వర్షం కురిపిస్తున్నాడు. తొలి వన్డేలో 3 సిక్సులు, రెండో వన్డేలో 4 సిక్సులు బాదాడు. ఇక మూడో వన్డేలో కూడా నాలుగు సిక్సులు బాది అభిమానులను అలరించాడు. అయితే మాక్స్‌వెల్‌ చివరి వన్డేలో ఆడిన ఓ షాట్ అందిరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

స్విచ్‌హిట్‌తో 100 మీటర్ల సిక్స్

మూడో వన్డేలో గ్లెన్ మాక్స్‌వెల్‌ ఆడిన ఓ షాట్ ఆ సిరీస్‌కే ప్రత్యేకంగా నిలిచిపోయింది. మణికట్టు స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్ వేసిన 42.3వ బంతిని మాక్సీ 100 మీటర్ల సిక్సర్‌గా మలిచాడు. అయితే ఆ షాట్‌ను స్విచ్‌హిట్‌గా బాదడమే ఇక్కడ ప్రత్యేకత. ఆఫ్‌సైడ్‌ దూరంగా వేసిన బంతిని ఆడేందుకు మాక్స్‌వెల్‌ తన స్టాన్స్‌ను మార్చుకున్నాడు. రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసే మాక్సీ లెఫ్ట్ హ్యాండ్ వైపు తిరిగి షాట్ ఆడాడు. రివర్స్‌స్వీప్‌‌ ద్వారా డీప్‌ పాయింట్‌ మీదుగా కళ్లుచెదిరే సిక్సర్‌ బాదేశాడు. బంతి రెప్పపాటులో వెళ్లి ప్రేక్షకుల మధ్య పడింది. ఆ షాట్ చూసిన వారందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీనికి సంబందించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా పోస్ట్ చేసింది.

చాపెల్‌ ఫైర్

చాపెల్‌ ఫైర్

అయితే స్విచ్‌హిట్‌‌ ఆడటం అన్యాయమని, దాన్ని నిషేధించాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ తాజాగా ఐసీసీకి సూచించాడు. 'స్విచ్ హిట్టింగ్‌ ఎంతో నైపుణ్యమైన షాట్‌. మాక్స్‌వెల్, వార్నర్‌ ఎన్నోసార్లు ఆడారు. కానీ అది న్యాయబద్ధమైనది మాత్రం కాదు, చట్టవిరుద్ధమైన షాట్. ఫీల్డింగ్‌ చేసే జట్టుకు నష్టం చేస్తుంది. క్రికెట్‌లో ఆ షాట్‌ను ఐసీసీ నిషేధించాలి. బౌలింగ్ వేసే ముందు బౌలర్‌ ఏ స్థానం నుంచి బౌలింగ్ చేస్తున్నాడనేది అంపైర్‌కు ముందుగా తెలియజేస్తున్నట్లు బ్యాట్స్‌మన్‌ కూడా స్విచ్ హిట్టింగ్ గురించి చెబితే అది న్యాయబద్ధంగా ఉంటుంది' అని పేర్కొన్నాడు.

నిబంధనకు లోబడే ఆడాను

నిబంధనకు లోబడే ఆడాను

ఇయాన్‌ చాపెల్‌ వ్యాఖ్యలపై తాజాగా గ్లెన్ మాక్స్‌వెల్‌ స్పదించాడు. నిబంధనలకు లోబడే తాను స్విచ్‌ హిట్‌లు ఆడుతున్నానని పేర్కొన్నాడు. 'స్విచ్‌ హిట్‌ నిబంధనకు లోబడే ఉంది. బ్యాటింగ్‌లో ఏళ్లుగా ఎన్నో మార్పులొచ్చాయి. స్విచ్‌ హిట్‌ అందులో భాగమే. ఈ షాట్‌ను ఎదుర్కొనేందుకు బౌలర్లు పోరాడాలి. బ్యాట్స్‌మెన్‌ను షాట్లు కొట్టకుండా చేసేందుకు బౌలర్లు ప్రణాళికలు రచిస్తున్నారు. నకుల్‌ బాల్‌ లాంటివి ఉపయోగిస్తున్నారు' అని మ్యాక్స్‌వెల్‌ అన్నాడు.

11 సిక్సర్లు

11 సిక్సర్లు

ఐపీఎల్ 2020లో సింగల్ తీయడానికి కూడా తడబడ్డ గ్లెన్ మాక్స్‌వెల్‌.. టీమిండియాతో వన్డే సిరీసులో మాత్రం పరుగుల దాహం తీర్చుకున్నాడు. మూడు మ్యాచుల్లో 194.19 స్ట్రైక్‌రేట్‌, 83.50 సగటుతో 167 పరుగులు చేశాడు. అందులో 12 బౌండరీలు, 11 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఈ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన వీరుడు మాక్సీనే కావడం విశేషం. ఆరోన్ ఫించ్‌, స్టీవ్ స్మిత్‌, హార్దిక్ పాండ్యా‌, రవీంద్ర జడేజా జడేజా తలో 6 సిక్సర్లతో మాక్సీ తర్వాతే ఉన్నారు.

'పాండ్యా చాలా తెలివిగా బ్యాటింగ్ చేశాడు.. అతని ఆటలో పరిపక్వత కనిపించింది'

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Thursday, December 3, 2020, 14:42 [IST]
Other articles published on Dec 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X