బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. కేఎల్ రాహుల్‌ను క్షమించమని కోరా: మాక్స్‌వెల్‌

India vs Australia 1st ODI : 'I Apologised To KL Rahul While Batting' : Glenn Maxwell

సిడ్నీ: ఆస్ట్రేలియాలో సుదీర్ఘ పర్యటనను భారత్‌ ఓటమితో ఆరంభించింది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌ 66 పరుగుల తేడాతో భారీ విజయాన్నందుకుంది. దీంతో మూడు వన్డేల సిరీ్‌సలో 1-0తో ఆధిక్యంలో ఉంది. ముందుగా ఆసీస్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 374 పరుగుల స్కోరు సాధించింది. కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (124 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 114), మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌ (66 బంతు ల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 105) సెంచరీలతో మోతెక్కించగా.. గ్లెన్ మాక్స్‌వెల్‌ (45; 19 బంతుల్లో 5×4, 3×6) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అనంతరం ఆడమ్‌ జంపా 4, హాజెల్‌వుడ్‌ 3 వికెట్లతో చెలరేగడంతో భారత్ ఓడిపోయింది.

కోహ్లీసేన స్లో ఓవర్ రేట్‌.. పాకిస్థానీకి అదిరే బదులిచ్చిన వసీం జాఫర్!!

19 బంతుల్లోనే 45 పరుగులు:

ఐపీఎల్ 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున 13 మ్యాచ్‌లు ఆడి ఒక్క సిక్స్ కూడా కొట్టకుండా తీవ్రంగా నిరాశపర్చిన గ్లెన్ మాక్స్‌వెల్‌.. తొలి వన్డేలో 3 సిక్సులు బాది ఆశ్చర్యపరిచాడు. 19 బంతుల్లోనే 45 పరుగులు చేసిన మాక్స్‌వెల్‌పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు ఐపీఎల్‌ 2020లో పంజాబ్ తరఫునే ఆడిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ సైతం నిరాశపర్చాడు. కానీ శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 24 బంతుల్లో 48 రన్స్ చేసి ఔరా అనిపించాడు.

రాహుల్ ఇలా చూస్తున్నాడు:

పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. మాక్స్‌వెల్‌పై ఎంతో నమ్మకం ఉంచి 13 మ్యాచ్‌ల్లో అవకాశం ఇచ్చాడు. అతడు మాత్రం 108 రన్స్ మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. దీంతో పంజాబ్ ఫ్యాన్స్ మాక్స్‌వెల్, నీషమ్‌లను ట్రోల్ చేస్తున్నారు. 'నీషమ్, మాక్స్‌వెల్ తమ జాతీయ జట్ల తరఫున కీలక ఇన్నింగ్స్ ఆడుతుంటే.. కేఎల్ రాహుల్ ఇలా చూస్తున్నాడు' అంటూ మార్ఫింగ్ చేసిన రాహుల్ ఫొటోను వరుణ్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్టు చేశాడు. అంతేకాదు నీషమ్‌ను ట్యాగ్ చేశాడు. ఆ ఫొటోను చూసి నీషమ్.. అది నిజమే అంటూ మ్యాక్స్‌వెల్‌ను ట్యాగ్ చేశాడు.

సారీ చెప్పా:

సారీ చెప్పా:

జిమ్మీ నీషమ్ ట్వీట్‌కు స్పందించిన గ్లెన్ మాక్స్‌వెల్‌.. తాను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వికెట్ల వెనుక ఉన్న కేఎల్ రాహుల్‌కు సారీ చెప్పానని నవ్వుతూ కామెంట్ చేశాడు. మాక్స్‌వెల్‌ తన ట్వీట్‌కు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రెండ్స్ అనే హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫాన్స్ కూడా తమదైన స్టయిల్లో సెటైర్లు వేస్తున్నారు. ఐపీఎల్ 2020లో అదరగొట్టిన రాహుల్.. తొలి వన్డేలో మాత్రం విఫలమయ్యాడు. 15 బంతుల్లో 12 రన్స్ మాత్రమే చేశాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Saturday, November 28, 2020, 14:24 [IST]
Other articles published on Nov 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X