
శనివారం నుంచి తొలి వన్డే
శనివారం సిడ్నీ వేదికగా జరగనున్న తొలి వన్డే కోసం ఆసీస్ పిచ్‌లకు అలవాటు పడేందుకు గాను మహేంద్ర సింగ్ ధోని, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్ బుధవారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ)లోని నెట్స్‌లో సాధన చేశారు. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సమక్షంలో ధోని ఇండోర్ నెట్స్‌లో గడపగా... రాయుడు, ధావన్ పూర్తిగా కుడి, ఎడమ త్రో డౌన్స్‌ను ఎదుర్కొన్నారు.

ప్రాక్టీస్ సెషన్ తప్పనిసరి కాదు
బుధవారం ప్రాక్టీస్ సెషన్ తప్పనిసరి కాకపోవడంతో బౌలర్లు ఎవరూ పాల్గొనలేదు. దీంతో త్రోడౌన్స్ స్పెషలిస్టులతో అంబటి రాయుడు, శిఖర్ ధావన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా ఈ మూడు వన్డేల సిరిస్‌తో ముగియనుంది. అనంతరం న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను టీమిండియా ఆడనుంది.
మే 30 నుంచి ఇంగ్లాండ్‌లో వరల్డ్‌కప్
న్యూజిలాండ్ సిరిస్ అనంతరం స్వదేశంలో మార్చి 23 నుంచి ఆసీస్‌తో ఐదు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌ల ఆడనుంది. మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్‌కు ఈ సిరిస్‌లు ప్రాక్టీస్‌గా టీమిండియాకు ఉపయోగపడనున్నాయి. ఇలా వరల్డ్‌కప్‌కు ముందు కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా పలు కీలక సిరీస్‌లు ఆడనుంది.
2-1తో టెస్టు సిరిస్ నెగ్గిన భారత్
ఈ సిరీస్‌లలో మెరుగైన ప్రదర్శన ఆధారంగా మెగాటోర్నీకి ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుదీర్ఘ ఆస్ట్రేలియాలో పర్యటనలో భాగంగా ఇటీవలే ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించగా... అంతకముందు జరిగిన మూడు టీ20ల సిరిస్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications

