
ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా
అయితే, ఆతిథ్య జట్టుని ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా.. టీమండియా అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. చివరి రోజు బ్యాటింగ్ కష్టమవుతుందనే ఉద్దేశంతో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్‌కు దిగినట్లు తెలుస్తోంది. అయితే, రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్ స్వల్ప వ్యవధిలోనే టాప్ ఆర్డర్‌ను చేజార్చుకుంది.

ముగిసిన మూడో రోజు: భారత్ 54/5
దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 27 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా 54 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత్ 346 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్ (28), రిషబ్ పంత్ (6) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత జట్టులో పుజారా, కోహ్లీ డకౌట్ కాగా రహానే(1), రోహిత్ శర్మ(5) వెనువెంటనే పెవిలియన్ చేరారు.

మూడు నుంచి ఆరు స్థానాల్లో
ఒక ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్‌లో మూడు నుంచి ఆరు స్థానాల్లో బ్యాటింగ్ వచ్చిన ఆటగాళ్లు అందరూ కలిసి కేవలం 6 పరుగులు మాత్రమే జోడించారు. 1983 తర్వాత భారత క్రికెట్ జట్టు ఇంత ఘోరంగా విఫలమవడం ఇదే తొలిసారి. 1983లో అహ్మదాబాద్‌లో విండీస్‌తో టెస్టులో నలుగురు మిడిలార్డర్ ఆటగాళ్లు 9 పరుగులు రాబట్టారు.

హైదరాబాద్ వేదికగా జరిగిన టెస్టులో సైతం
1969లో హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో సైతం ఇవే గణాంకాలు నమోదు చేశారు. అంతకముందు 1946లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్పంగా భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కేవలం 6 పరుగులు జోడించడం విశేషం.


Click it and Unblock the Notifications
