For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రీజులో ధోని ఉంటే చాలు... ఆ ఆత్మవిశ్వాసమే వేరు: కేదార్ జాదవ్

India vs Australia: Every time I see MS Dhoni, I feel confident - Kedar Jadhav

హైదరాబాద్: క్రీజులో అవతలి ఎండ్‌లో ధోని ఉంటే.. బ్యాటింగ్‌ చేసే ఆటగాడిలో ఉండే ఆత్మవిశ్వాసమే వేరని టీమిండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేదార్‌ జాదవ్‌ అన్నాడు. హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ధోనితో కలిసి కేదార్ జాదవ్ 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. వీరిద్దరి భాగస్వామ్యమే జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. 81 పరుగులు చేసి భారత్‌కు విజయాన్ని అందించిన కేదార్ జాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. మ్యాచ్ అనంతరం కేదార్ జాదవ్ మీడియాతో మాట్లాడాడు.

ధోని క్రీజులో ఉన్నంతసేపూ

ధోని క్రీజులో ఉన్నంతసేపూ

"ధోని క్రీజులో ఉన్నంతసేపూ ప్రత్యర్థి జట్టు ఒత్తిడిలోనే ఉంటుంది. శనివారం మ్యాచ్‌లో ధోని తొడ కండరాలు పట్టేసి ఇబ్బంది పడ్డాడు. అతడి దగ్గరికెళ్లి ఒకటే చెప్పా.. ‘నువ్వు క్రీజులో ఉండు చాలు, అదే నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్నిస్తుంది' అని. ధోనితో ఎప్పుడు సమయం గడిపినా చాలా నేర్చుకుంటాను" అని జాదవ్ అన్నాడు.

ధోనీని చూస్తే చాలు ఆత్మవిశ్వాసం

ధోనీని చూస్తే చాలు ఆత్మవిశ్వాసం

"ధోనీని చూస్తే చాలు ఆత్మవిశ్వాసం వచ్చేస్తుంది. ఆ భావనను మాటల్లో వర్ణించలేను. ‘ఈ రోజు నేను ఆడతాను' అనే నమ్మకం కలుగుతుంది. ప్రతి ఆటగాడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకోవడం ఎలాగో ధోనికి తెలుసు. అతడిలో నాకు నచ్చే విషయమదే" అని కేదార్‌ జాదవ్ చెప్పుకొచ్చాడు.

10-15 శాతం తాను సాధించినా అదెంతో

10-15 శాతం తాను సాధించినా అదెంతో

ధోని, కోహ్లీ తమ కెరీర్లలో ఎంతో సాధించారని, అందులో 10-15 శాతం తాను సాధించినా అదెంతో గొప్పే అవుతుందని జాదవ్ అన్నాడు. వైవిధ్యమైన షాట్లు ఆడటం తనకు ముందు నుంచే అలవాటైందని, పరిస్థితుల్ని బట్టి మ్యాచ్‌ల్లో ఆ షాట్లు ఆడుతున్నానని కేదార్‌ జాదవ్ వెల్లడించాడు. ఉప్పల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఐదు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో భారత్

ఐదు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో భారత్

కేదార్ జాదవ్ (81 నాటౌట్), ధోనీ (59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 237 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి భారత్ 48.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌లో 1-0తో భారత్ ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మార్చి 5న నాగ్‌పూర్ వేదికగా జరగనుంది.

Story first published: Monday, March 4, 2019, 9:22 [IST]
Other articles published on Mar 4, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+