న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sydney Test: సిరాజ్ సూపర్.. వార్న‌ర్‌ ఔట్!! మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం!!

India vs Australia: Early Lunch has been taken after rain stopped play in Sydney

సిడ్నీ: బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభం అయిన మూడో టెస్టు మ్యాచ్‌కు వరణుడు అడ్డంకిగా నిలిచాడు. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా 7.1 ఓవర్లలో 1 వికెట్‌ నష్టానికి 21 పరుగులు చేసింది. ఈ సమయంలో వరణుడు అడ్డుపడడంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. అంతకుముందు వర్షం కారణంగా మ్యాచ్‌ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. అర్ధ గంట కూడా కాకముందే మరోసారి వర్షం జోరందుకుంది. ప్రస్తుతం లంచ్ బ్రేక్‌గా అంపైర్లు ప్రకటించారు.

విమానంలో వెళ్లి.. ముంబైలో మ్యాచ్‌ ఆడమన్నా ఆడతాం: ఆసీస్‌ కెప్టెన్‌‌విమానంలో వెళ్లి.. ముంబైలో మ్యాచ్‌ ఆడమన్నా ఆడతాం: ఆసీస్‌ కెప్టెన్‌‌

సిరాజ్ షాక్:

సిరాజ్ షాక్:

ఆసీస్ గ‌డ్డ‌పై జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ గ‌ట్టి షాక్ ఇచ్చాడు. అద్భుత బంతితో స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్న‌ర్‌ను పెవీలియ‌న్‌కు పంపాడు. జట్టు స్కోరు 6 పరుగుల వద్ద సిరాజ్‌ బౌలింగ్‌లో వార్నర్‌ స్లిప్‌లో చేటేశ్వర్ పూజారా చేతికి చిక్కాడు. అనంతరం క్రీజులోకి మార్నస్ లబుషేన్‌ వచ్చాడు. ప్రస్తుతం క్రీజులో విల్‌ పకోస్కీ (14), లబుషేన్‌ (2) ఉన్నారు. ఆస్ట్రేలియా 7.1 ఓవర్లలో 1 వికెట్‌ నష్టానికి 21 పరుగులు చేసింది.

సైనీ ఆరంగ్రేటం:

సైనీ ఆరంగ్రేటం:

సిడ్నీ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో మ‌యాంక్ అగ‌ర్వాల్ స్థానంలో రోహిత్ శ‌ర్మ తుది జ‌ట్టులోకి రాగా, గాయపడిన ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో నవదీప్‌ సైనీని జట్టులోకి తీసుకున్నారు. టెస్టుల్లో భారత్‌ తరపున 299వ ఆటగాడిగా సైనీ ఆరంగ్రేటం చేశాడు. సహచర ఆటగాళ్ల అభినందనల నడుమ సీనియర్‌ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా చేతుల మీదుగా టెస్ట్‌ జట్టు క్యాప్‌ను షైనీ అందుకుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా తరపున విల్‌ పకోవ్‌స్కీ ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాడు. ప్ర‌స్తుతం అత‌ను 29 బంతుల్లో 14 ప‌రుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు.

జట్లు:

భారత్ : రహానే (కెప్టెన్‌), రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్, పుజారా, విహారి, పంత్, జడేజా, అశ్విన్, సిరాజ్, బుమ్రా, సైనీ.

ఆస్ట్రేలియా : పైన్‌ (కెప్టెన్‌), వార్నర్, పకోవ్‌స్కీ, స్మిత్, లబ్‌షేన్, వేడ్, గ్రీన్, కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్, లయన్‌.

Story first published: Thursday, January 7, 2021, 7:26 [IST]
Other articles published on Jan 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X