హైదరాబాద్: చెన్నైలో జరిగిన తొలి వన్డేలో భారత్ గెలుపుకు వర్షం కారణమని వ్యాఖ్యానించి నవ్వులు పాలైన ఆసీస్ క్రికెట్ వ్యాఖ్యాత డీన్ జోన్స్ గుర్తున్నాడా? టీమిండియా విజయం సాధించాలంటే వర్షం పడాలేమో? ట్విట్టర్‌లో ట్వీట్ చేయడంతో భారత్ అభిమానులు అతడిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నీకేమైనా బ్రెయిన్ ఫేడ్ అయ్యిందా? అంటూ ట్రోల్ చేశారు. తాజాగా ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఆసీస్‌పై టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడో వన్డేలో అద్భుత ప్రదర్శన చేసిన హార్ధిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
దీంతో పాండ్యాను కొనియాడిన జోన్స్ మరోసారి విమర్శలకు గురయ్యాడు. హార్దిక్ బౌలింగ్ యాక్షన్ అచ్చం వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం మైకేల్ హోల్డింగ్‌లా ఉందంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. అయితే ఇక్కడ స్పీడ్ సంగతిని పక్కన పెడితే హోల్డింగ్ తరహాలోనే పాండ్యా బౌలింగ్ చేస్తున్నాడని ప్రశంసించాడు.
ఈ ట్వీట్‌పై క్రికెట్ అభిమానులు జోన్స్‌పై పండిపడుతున్నారు. పాండ్యా లాంటి 'సాధారణ బౌలర్‌ని దిగ్గజ బౌలర్ హోల్డింగ్‌తో ఎలా పోల్చావంటూ' ఒక అభిమాని విమర్శించగా, 'నువ్వొక పెద్ద క్రికెట్ అభిమానిలా కనబడతావ్. కానీ క్రికెటర్లను ఎలా పోల్చాలి అనేది నీకు ఇంకా తెలియలేదు. నువ్వు ఎక్కువగా రేడియోలో క్రికెట్‌ను ఫాలో అవుతావేమో' అంటూ మరొక అభిమాని అన్నాడు.
'ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు అందులో పస ఉండాలనే సంగతి గుర్తు పెట్టుకో డీన్ జోన్స్' అంటూ మరో అభిమాని పేర్కొన్నాడు. వీటికి సంబంధించిన ట్వీట్స్ మీకోసం...