‘The Scaredy Bats’: తొలి టెస్ట్‌కు ముందే కోహ్లీసేనపై ఆసీస్ మీడియా పైత్యం

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియా మీడియాలో మార్పు తెస్తుందని అనుకోవడం పొరపాటే. గోదావరి నది ఈదినప్పటికీ కుక్క కోత వంకరే అన్న సామెత ఆస్ట్రేలియా మీడియాకు చక్కగా సరిపోతోంది. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది.
నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబర్ 6న అడిలైడ్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా ఇప్పటికే అడిలైడ్‌కు చేరుకుంది. సోమవారం జట్టులోని పలువురు ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్‌కు సైతం హాజరయ్యారు.

టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు
అయితే, ఆస్ట్రేలియాలో పర్యటించే జట్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు అక్కడి మీడియా ఎప్పుడూ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూనే ఉంటుంది. తాజాగా టీమిండియాను లక్ష్యంగా చేసుకుని ఓ స్థానిక పత్రిక తమ పైత్యాన్ని ప్రదర్శించింది. తొలి టెస్టు కోసం అడిలైడ్ చేరుకున్న టీమిండియా ఫొటోపై ‘భయపడే బ్యాట్లు' పేరుతో శీర్షిక పెట్టింది.
ఆస్ట్రేలియాలో వేదికలంటే భయం
అంతేకాదు ఆసీస్ గడ్డపై ఉన్న వేదికలంటే భారత జట్టు ఎలా భయపడుతుందో చెబుతూ కూడా అందులో పేర్కొంది. బ్రిస్బేన్‌లో బౌన్స్ అంటే భయం.. పెర్త్‌లో ఏదో తెలీని భయం.. అడిలైడ్‌లో చీకటంటే భయం (డే అండ్ నైట్ టెస్టుకు అంగీకరించని కారణంగా)గా కింద బాక్సుల్లో ఇచ్చారు. ఈ ఫొటోలో భువనేశ్వర్, జడేజా ఉన్నారు.

గురువారం నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం
కాగా, ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీసేన మరో కఠిన సవాల్‌కు సిద్ధమైంది. గురువారం నుంచి అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. 1947 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకు 12 సార్లు వెళ్లిన టీమిండియా ఇప్పటివరకు ఒక్క టెస్టు సిరిస్‌ను కూడా గెలవలేదు.

చరిత్ర సృష్టించాలని ఊవిళ్లూరుతోన్న కోహ్లీసేన
9 టెస్టు సిరిస్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించగా... 3 టెస్టు సిరిస్‌లను భారత డ్రాగా ముగించింది. అయితే, ఈసారి ఆసీస్ గడ్డపై టెస్టు సిరిస్‌ను గెలిచి చరిత్ర సృష్టంచాలని కోహ్లీసేన ఊవిళ్లూరుతోంది. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేకపోవడంతో ఆ జట్టు బలహీనంగా కనిపిస్తోంది.
ఆసీస్ మీడియా అత్యుత్సాహాంపై మండిపడుతోన్న నెటిజన్లు:
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications