Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కష్టపడి, కేవలం మంచి క్రికెట్‌ ఆడండి: ఆసీస్ క్రికెటర్లకు కొత్త ఛైర్మన్

India vs Australia: Cricket Australia chairman Earl Eddings wants hosts to play hard but fair cricket in upcoming series

హైదరాబాద్: 'కష్టపడి ఆడండి కానీ నిజాయతీగా ఉండండి' ఈ మాటలు మాట్లాడింది ఎవరో కాదు క్రికెట్ ఆస్ట్రేలియాకు కొత్తగా ఎంపికైన ఛైర్మన్ ఎర్ల్ ఎడ్డింగ్స్‌. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ టెస్టు సిరిస్‌ను ఇరు జట్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ సిరిస్ నేపథ్యంలో 'ఎలైట్ ఆనెస్టీ' అనే పదం గత కొన్నిరోజులుగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ సందర్భంలో సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఎర్ల్ ఎడ్డింగ్స్‌ మాట్లాడుతూ "కష్టపడి, కేవలం మంచి క్రికెట్‌ ఆడండి. ప్రజలు మనం ఆట పట్ల గౌరవంతో ఉండాలని మాత్రమే అనుకుంటారు. దానిని గుర్తు పెట్టుకోండి" అని ఆస్ట్రేలియా జట్టు సభ్యులకు సూచించారు.

ఒకవేళ ఓటమి పాలైనా

ఒకవేళ ఓటమి పాలైనా

"కష్టపడి ఆడండి కానీ నిజాయతీగా ఉండండి. గెలిచేందుకు ప్రయత్నించండి. ఒకవేళ ఓటమి పాలైనా... మంచి ఆడే ఓటమి పాలవ్వండి. గెలిస్తే గొప్పలకు పోకండి, ఓడితే తక్కువగా మాట్లాడండి అని ఓ పాత సామెత ఉంది. మనది గొప్ప జట్టని నా అభిప్రాయం. మంచిగా ప్రవర్తిస్తారని అనుకుంటున్నా. సహజంగా మీరు ఆడే ఆట ఆడండి. మీకు సాధ్యమైనంత కష్టపడండి. ఆసీస్ మీ నుంచి అదే కోరుకుంటుంది" అని ఆసీస్ క్రికెటర్లతో చెప్పారు.

 డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్ట్

డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్ట్

అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగే తొలి టెస్టు ఫ్లడ్ లైట్స్ మధ్య ఆడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో "డే-నైట్ క్రికెట్ భవిష్యత్తుకు ఒక దారి చూపిస్తుంది. దానిని అన్ని దేశాలు, వేదికల్లో ఆడటం కుదరదు. ఆడిలైడ్లో ఆ మ్యాచ్ ఎంత విజయం సాధిస్తుందో మీరే చూస్తారు" అని ఎడ్డింగ్స్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. బాల్ టాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియా ప్రతిష్టను మసకబారేలా చేసింది.

కొత్త కోచ్‌ జస్టిన్ లాంగర్ ఆధ్వర్యంలో

కొత్త కోచ్‌ జస్టిన్ లాంగర్ ఆధ్వర్యంలో

దీంతో కొత్త కోచ్‌ జస్టిన్ లాంగర్ ఆధ్వర్యంలో క్రీడాకారులు తమ పూర్వ వైభవాన్ని పొందుతారని ఆస్ట్రేలియా అభిమానులు భావిస్తున్నారు. ఇటీవలే క్రికెట్ ఆస్ట్రేలియాకు ఛైర్మన్‌గా ఎర్ల్ ఎడ్డింగ్స్‌ నిమితులయ్యారు. ఈ ఏడాది మొదట్లో సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ టాంపరింగ్ ఉదంతానికి పాల్పడటంతో ఆదే బోర్డులో సైతం అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

 బాల్ టాంపరింగ్ ఘటనతో క్రికెట్ ఆస్ట్రేలియాలో అనేక మార్పులు

బాల్ టాంపరింగ్ ఘటనతో క్రికెట్ ఆస్ట్రేలియాలో అనేక మార్పులు

ఆస్ట్రేలియా జట్టుకు కొత్త కోచ్ రావడంతోపాటు కొత్త ఛైర్మన్‌ నియామకం జరిగింది. బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన డేవిడ్ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించగా... కామెరూన్ బాన్‌క్రాఫ్ట్‌‌పై తొమ్మిది నెలల పాటు నిషేధం విధించింది.

Story first published: Saturday, December 1, 2018, 18:00 [IST]
Other articles published on Dec 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+