Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆట కోసమే వదిలేశాం!: డీఆర్ఎస్ వివాదంపై డయానా ఎడుల్జీ

హైదరాబాద్: డీఆర్ఎస్ వివాదాన్ని మరింత పొడిగించకూడదనే ఉద్దేశంతోనే ఐసీసీకి చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లు బీసీసీఐ పరిపాలనా కమిటీ (సీఓఏ) సభ్యురాలు డయానా ఎడుల్జీ వెల్లడించారు. అంతేకాదు ఈ వివాదం ఇలాగే కొనసాగితే భారత్‌ సాధించిన విజయం మరుగున పడుతుందన్న ఉద్దేశంతోనే ఆ వివాదాన్ని వదిలేసినట్లు ఆమె చెప్పింది.

ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డీఆర్‌ఎస్ అవుట్ వివాదంతో బెంగళూరు టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన అద్భుత విజయంపై నుంచి మీడియా దృష్టి మరలిందని ఆమె తెలిపారు. 'బీసీసీఐ అవార్డుల వేడుక కోసం మేం బెంగళూరులోనే ఉన్నాం. ఈ వివాదంపై పాలనా కమిటీ బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రి, కోచ్‌ అనిల్‌ కుంబ్లేలతో చర్చించింది. విక్రమ్‌ లిమాయె వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడాడు. ఆట కోసం సిరీస్‌ ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా సాగిపోవాలనే ఈ వివాదాన్ని అంతటితో వదిలేయాలని నిర్ణయించాం' అని ఆమె తెలిపారు.

కోహ్లీకి బీసీసీఐ పూర్తి మద్దతు

కోహ్లీకి బీసీసీఐ పూర్తి మద్దతు

'డీఆర్ఎస్ రివ్యూ విషయంలో కెప్టెన్ కోహ్లీకి బీసీసీఐ పూర్తి మద్దతుగా నిలిచింది. అతనిపై మాకు పూర్తి నమ్మకం, విశ్వాసముంది. ఇరు జట్ల మధ్య స్నేహపూర్వక టెస్ట్ సిరీస్ కొనసాగించాలని అనుకున్నాం. క్రికెట్‌పై నుంచి ఏ ఒక్కరి దృష్టి చెదిరిపోకుండా చేయాలనుకున్నాం. రాంచీ టెస్టుకు ముందు ఇరు జట్ల కెప్టెన్లు కలిసి చర్చించుకుని భేదాభిప్రాయాలను పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాం' అని ఎడుల్జీ శుక్రవారం మీడియాతో పేర్కొంది.

ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను దృష్టిలో పెట్టుకుని

ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను దృష్టిలో పెట్టుకుని

మరోవైపు ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలుకాలని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్ విజ్ఞప్తి మేరకే భారత్‌ వెనక్కి తగ్గినట్లు సమాచారం. అయితే ఫిర్యాదుపై వెనక్కి తగ్గినంత మాత్రాన కోహ్లీకి తాము మద్దతుగా నిలవనట్లు కాదని ఆమె అన్నారు.

బోర్డు అండగా నిలవలేదని ఎవరూ భావించకూడదనే

బోర్డు అండగా నిలవలేదని ఎవరూ భావించకూడదనే

ఇందులో భాగంగానే టీమిండియా కెప్టెన్‌కు బోర్డు అండగా నిలవలేదని ఎవరూ భావించకూడదని మేం కోహ్లీకి మద్దతుగా ప్రకటన విడుదల చేశామని ఎడుల్జీ వెల్లడించారు. బెంగుళూరు వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ 21వ ఓవర్లో ఉమేశ్‌ వేసిన మూడో బంతిని ఎదుర్కొన్న స్మిత్‌ ఎల్బీడబ్ల్యూగా అవుటైనట్లు భారత ఆటగాళ్లు అప్పీల్ చేశారు.

ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డీఆర్ఎస్ రివ్యూ

ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డీఆర్ఎస్ రివ్యూ

దీంతో వెంటనే అంపైర్‌ కెప్టెన్ స్మిత్‌ అవుటైనట్లు ప్రకటించాడు. వెంటనే భారత్‌ ఆటగాళ్లు సంబరాల్లో మునిగారు. వెంటనే రివ్యూ కోరదామని నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న హ్యాండ్స్ కోంబ్‌ను అడిగాడు. దీంతో అతడు డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపుతూ టీమ్ మేట్స్‌ను సలహా కోరమని సూచించాడు. ఇదంతా సమీపంలో ఉన్న కోహ్లీ గమనించి అంపైర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు.

మైదానాన్ని వీడి వెళ్లిన స్టీవ్ స్మిత్

మైదానాన్ని వీడి వెళ్లిన స్టీవ్ స్మిత్

ఈ సమయంలో అంపైర్ నిగెల్ లాంగ్ కల్పించుకొని అది నిబంధనలకు విరుద్ధమని వారించడంతో మైదానాన్ని వీడి స్మిత్ వెళ్లిపోయాడు. ఇలా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన స్టీవ్ స్మిత్ తీరుపై అటు భారత మాజీ క్రికెటర్లతో పాటు ఆసీస్ మాజీలు సైతం తీవ్రస్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+