న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నవ్వులు: ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలో జర్నలిస్ట్ ఫోన్‌ మాట్లాడిన టిమ్ పైన్

India vs Australia: Can I Get Him To Call You Back?: Tim Paine Answers Mid-Presser Phone Call

హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఓటమి దిశగా పయనిస్తోంది. గురువారం ప్రారంభమైన ఈ టెస్టులో టీమిండియా పటిష్టిస్థితిలో నిలిచింది. వరుసగా రెండో రోజు కూడా ఆ జట్టుకు కలిసి రాలేదు.

<strong>పుజారా మారథాన్ ఇన్నింగ్స్: సిడ్నీ టెస్టులో రెండో రోజు నమోదైన గణాంకాలివే</strong>పుజారా మారథాన్ ఇన్నింగ్స్: సిడ్నీ టెస్టులో రెండో రోజు నమోదైన గణాంకాలివే

అయినా సరే ఆ జట్టు కెప్టెన్ టిమ్ పైన్‌ మాత్రం ఒత్తిడిని దరిచేరనీయడం లేదు. రెండో రోజైన శుక్రవారం ఆట ముగిసిన తర్వాత టిమ్ పైన్ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నాడు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు టిమ్ పైన్ సీరియస్‌గా సమాధానాలు చెబుతున్న సమయంలో ఓ మొబైల్ ఫోన్ మోగింది.

ఈ ఫోన్ ఎవరిది అంటూ కాల్ లిఫ్ట్ చేసిన పైన్

ఈ ఫోన్ ఎవరిది అంటూ కాల్ లిఫ్ట్ చేసిన పైన్

దీంతో ఈ ఫోన్ ఎవరిది అంటూ ఆ కాల్ లిఫ్ట్ చేశాడు. దీంతో టిమ్ పైన్ మాట్లాడుతూ మీకు ఎవరు కావాలి అంటూ అడిగాడు. దానికి అవతలి వ్యక్తి తన పేరు కేసీ అని, తనకు మార్టిన్ కావాలని అడిగింది. అతడు ప్రెస్‌మీట్‌లో మధ్యలో ఉన్నాడని, తర్వాత అతనితో కాల్ చేయిస్తానని పేన్ చెప్పాడు.

ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలో ఇలా

ఒక్కసారి అతన్ని మెయిల్ చెక్ చేసుకోమని కేసీ చెప్పడంతో అలాగే అంటూ టిమ్ పైన్ ఫోన్ పెట్టేశాడు. ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలో ఓ జర్నలిస్ట్‌కు వచ్చిన ఫోన్ కాల్ లిప్ట్ చేసి టిమ్ పైన్ మాట్లాడటం చూసి అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

భారత్ 622/7 డిక్లేర్డ్

కాగా, సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పుజారా (193), రిష‌బ్ పంత్ (159 నాటౌట్‌), జ‌డేజా (81), మ‌యాంక్ అగ‌ర్వాల్ (77) రాణించడంతో భార‌త్ తొలి ఇన్నింగ్స్‌ను 622/7 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా బౌల‌ర్లలో లియాన్‌కు 4 వికెట్లు ద‌క్కాయి. హాజెల్‌వుడ్ 2, స్టార్క్ ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 24/0

అనంత‌రం ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగింది. రెండో రోజు కేవ‌లం ప‌ది ఓవ‌ర్లు మాత్ర‌మే ఆసీస్ బ్యాటింగ్ చేసింది. దీంతో రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆస్ట్రేలియా ప‌ది ఓవ‌ర్ల‌లో వికెట్లేమీ కోల్పోకుండా 24 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్లు హారిస్ (19 బ్యాటింగ్‌), ఖ‌వాజా (5 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

Story first published: Friday, January 4, 2019, 16:07 [IST]
Other articles published on Jan 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X