'స్టీవ్‌ స్మిత్ బలహీనత భారత బౌలర్లకి తెలియదా?.. ఆ బంతులను ఎందుకు వేయట్లేదు'

సిడ్నీ: 2018 మార్చిలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో కలిసి అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఏడాది పాటు నిషేధానికి గురై 2019 వన్డే ప్రపంచకప్‌లో తిరిగి ఆడాడు. తర్వాత వరుస శతకాలతో అలరిస్తున్నాడు. ఇంగ్లండ్‌పై మూడు టెస్టుల్లో సెంచరీలు చేశాడు. బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకొని అప్రతిష్ఠ మూటగట్టుకొని ఏడాది పాటు ఆటకు దూరమైనా.. స్మిత్ ఆట మరింత మెరుగైందే తప్ప తడబాటు మాత్రం లేదు. ఆకలికొన్న పులిలా పరుగుల ప్రవాహం పారిస్తున్నాడు. ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో అయితే రెచ్చిపోతున్నాడు.

షార్ట్ పిచ్ బంతులతో స్మిత్‌ను బోల్తా కొట్టించారు:

షార్ట్ పిచ్ బంతులతో స్మిత్‌ను బోల్తా కొట్టించారు:

తొలి వన్డేలో 66 బంతుల్లో 105 పరుగులు చేసిన స్టీవ్‌ స్మిత్.. రెండో వన్డేలోనూ 64 బంతుల్లో 104 పరుగులు చేశాడు. మొత్తంగా వన్డేల్లో స్మిత్‌ 11 సెంచరీలు బాదగా.. ఐదు శతకాలు భారత్‌పైనే సాధించడం గమనార్హం. రెండు వన్డేల్లోనూ ‌స్మిత్‌ను కట్టడి చేయడానికి భారత బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది .ఇక గేమ్ ప్లాన్ కూడా లేదు. వాస్తవానికి షార్ట్ పిచ్ బంతుల్ని ఆడలేకపోవడం ‌స్మిత్ బలహీనత. గత ఏడాది ప్రత్యర్థి బౌలర్లు ఎక్కువగా షార్ట్ పిచ్ బంతులతో స్మిత్‌ను బోల్తా కొట్టించారు. కానీ రెండు వన్డేల్లోనూ ఆ బంతుల్ని సంధించడంలో భారత ఫాస్ట్ బౌలర్లు విఫలమయ్యారు.

అదేం వ్యూహమో అర్థం కాలేదు:

అదేం వ్యూహమో అర్థం కాలేదు:

స్టీవ్ స్మిత్‌కు షార్ట్ పిచ్ బంతులను సందించలేకపోయిన భారత బౌలర్లపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ మండిపడ్డాడు. భారత బౌలర్లు ఎందుకు షార్ట్ పిచ్ బంతుల్ని సంధించలేకపోయారని ప్రశ్నించాడు. 'స్టీవ్ ‌స్మిత్ బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు భారత బౌలర్లు ఎందుకు షార్ట్ పిచ్ బంతుల్ని సంధించలేకపోయారు. మ్యాచ్‌ల్లో వాళ్లు గుడ్ లెంగ్త్, లిటిల్ ఫుల్లర్ బంతుల్ని విసిరారు. అదేం వ్యూహమో నాకు అర్థం కాలేదు. షార్ట్ పిచ్ బాల్ ఆడలేకపోవడం స్మిత్ బలహీనత. మరి ఎందుకు ఆ బంతుల్ని విసిరేందుకు భారత బౌలర్లు ప్రయత్నించలేదు' అని హగ్ ప్రశ్నించాడు. భారత ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ షార్ట్ పిచ్ బంతులను స్మిత్‌కు వేయడంలో విఫలమయ్యారు.

భారత్‌పైనే 5 శతకాలు:

భారత్‌పైనే 5 శతకాలు:

స్టీవ్ స్మిత్ వన్డేల్లో టీమిండియానే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే వన్డే ఫార్మాట్‌లో ఇప్పటివరకు స్మిత్ బాదింది 11 శతకాలే అయినా.. అందులో భారత్‌పైనే 5 సాధించడం విశేషం. ముఖ్యంగా ఈ ఏడాది స్మిత్ కొట్టిన మూడు శతకాలు టీమిండియాపైనే. తాజా వన్డే సిరీస్‌లో స్మిత్‌ 105, 104 పరుగులు బాదిన సంగతి పక్కనపెడితే.. ఇకపై జరగాల్సిన మూడో వన్డే, ఆపై టెస్టు సిరీస్‌లో ఎలా చెలరేగుతాడో చూడాలి. ఒకవేళ టెస్టు సిరీస్‌లోనూ భారత బౌలర్లు విఫలమైతే.. స్మిత్ మరోసారి కోహ్లీసేనకు చుక్కలు చూపించడం ఖాయం.

India vs Australia: '350+ స్కోరు చేయాలంటే.. టీమిండియాకు రోహిత్ సపోర్ట్ కావాలి'

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Monday, November 30, 2020, 21:27 [IST]
Other articles published on Nov 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X