
టీమిండియాపై విమర్శలు:
రవీంద్ర జడేజాకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా యుజువేంద్ర చహల్ బరిలోకి దిగడంతో కంకషన్ లొసుగుల్ని వాడుకుంటూ టీమిండియాపై విమర్శలొచ్చాయి. చహల్ మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడంతో ఆసీస్, ఇంగ్లాండ్‌కు చెందిన మాజీలు భారత్ వ్యూహాత్మకంగా కంకషన్‌ను వాడుకుందని ఆరోపించారు. ఈ ఆరోపణల పట్ల టీమిండియా స్పందించింది. వ్యూహాత్మకంగా జడేజాకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా చహల్‌ను తీసుకున్నారనే వ్యాఖ్యలు హాస్యాస్పదమైనవి పేర్కొంది.

పరీక్షించిన తర్వాత:
'గాయం అయిన సమయంలో రవీంద్ర జడేజాను సంజూ శాంసన్ ముందుగా చూశాడు. వెంటనే తన పక్కన కూర్చున్న మయాంక్ అగర్వాల్‌కు అతడు విషయం చెప్పాడు. జడేజా హెల్మెట్‌కు బంతి బలంగా తాకింది. ఈ విషయం తెలుసుకున్న మయాంక్.. వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి జట్టు మేనేజ్‌మెంట్‌కు సమాచారం అందించాడు. ఆ వెంటనే టీమ్ డాక్టర్‌ను పిలిపించాం. జడేజా తల, మెడ భాగంలో ఐస్‌తో మర్దన చేశాం. జడేజా పరిస్థితి ఆందోళన కలిగించింది. కాసేపటి తర్వాత తనకు అసౌకర్యంగా ఉందని జడేజా చెప్పాడు' అని బీసీసీఐ సీనియర్ అధికారొకరు ఓ ప్రకటనలో తెలిపారు. డాక్టర్ జడేజాను పరీక్షించిన తర్వాత మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్‌ను సంప్రదించామని స్పష్టం చేశారు.

లాంగర్ అభ్యంతరం:
జడేజా స్థానంలో చహల్ రావడంపై ఆస్ట్రేలియా కోచ్ లాంగర్, కెప్టెన్ అరోన్ ఫించ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్‌తో గొడవకి దిగారు. జడేజాకు కాంకషన్ సబ్‌స్టిట్యూట్ ఎలా ఇస్తారంటూ లాంగర్ చాలా ఆగ్రహంగా అడుగుతుండటం వీడియోలో కనిపించింది. కాంకషన్ సబ్‌స్టిట్యూట్ నిబంధనల మేరకు తాను చహల్‌ని అనుమతించినట్లు ఆయన స్పష్టం చేశారు. బ్యాట్‌మెన్ కాంకషన్‌కి గురై ఆటని కొనసాగించినా.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో వైద్యులు అతడికి విశ్రాంతి అవసరమని సూచిస్తే.. కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌ని అనుమతించేలా రూల్స్ ఉన్నాయి.

బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు అర్హుడు:
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గత ఏడాది ఆగస్టులో కాంకషన్ సబ్‌స్టిట్యూట్ రూల్‌ని తెరపైకి తెచ్చింది. కాంకషన్‌కి గురైన ఆటగాడి స్థానంలో జట్టులోకి వచ్చే క్రికెటర్ బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు అర్హుడు. తొలి టీ20లో చహల్ బౌలింగ్ చేయడమే కాకుండా.. తాను వేసిన తొలి రెండు ఓవర్లలో అరోన్ ఫించ్ (35), స్టీవ్ స్మిత్ (12).. ఆ తర్వాత వేడ్ (7) వికెట్లని పడగొట్టాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు.


Click it and Unblock the Notifications












