Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మ్యాచ్‌కు మరోసారి బ్రేక్ వేసిన అంపైర్లు

India vs Australia, Bad Light Causes Further Delay

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ టీమిండియా అద్భుతమైన స్కోరు సాధించినా.. చేధనకు దిగిన ఆస్ట్రేలియాకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాలుగో రోజు ఆటకు రెండోసారి అంతరాయం ఏర్పడింది. సిడ్నీ మైదానంలో వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్‌లో 322 పరుగుల వెనుకబడ్డ ఆసీస్‌.. ప్రస్తుతం ఫాలో ఆన్‌ ఆడుతోంది. 4 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 6 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్‌ ఖవాజా(4), హారిస్‌(2) ఉన్నారు.

622 ఛేదించే క్రమంలో విఫలమైన పైన్‌ సేన

622 ఛేదించే క్రమంలో విఫలమైన పైన్‌ సేన

ఆసీస్‌తో జరుగుతున్న చివరి టెస్టు నాలుగో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు దూకుడు కనబరిచారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా నిర్దేశించిన 622 ఛేదించే క్రమంలో పైన్‌ సేన విఫలమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ ఆరంభంలో వర్షం కారణంగా కాసేపు నిలిచిపోయింది. ఆటలో నాలుగోరోజైన ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 236/6తో తొలి ఇన్నింగ్స్‌‌ని కొనసాగించేందుకు ఆస్ట్రేలియా ప్రయత్నించగా.. వరుణుడు అడ్డుపడ్డాడు. కనీసం బ్యాట్స్‌మెన్‌ క్రీజులోకి వెళ్లకముందే వర్షం మొదలవడంతో ఆదివారం ఒక బంతి కూడా పడలేదు.

దాదాపు గంటసేపు సమయం వృథా

దాదాపు గంటసేపు సమయం వృథా

కాసేపటికి బ్యాటింగ్‌కు దిగిన వెంట వెంటనే 2 వికెట్లు చేజార్చుకుంది. 90వ ఓవర్లో బుమ్రా వేసిన బంతికి హాండ్స్‌కాంబ్‌(37) బౌల్డ్‌ అయ్యాడు. 91 ఓవర్లో కుల్‌దీప్‌ వేసిన బంతికి నాథన్‌ లయన్‌ పరుగులేమీ చేయకుండానే ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్‌ 91 ఓవర్లలో తొమ్మిది వికెట్లు చేజార్చుకుని 258 పరుగులు చేసింది. శుక్రవారం చతేశ్వర్ పుజారా (193: 373 బంతుల్లో 22ఫోర్లు), రిషబ్ పంత్ (159 నాటౌట్: 189 బంతుల్లో 15ఫోర్లు, 1సిక్సు) సెంచరీలు బాదడంతో తొలి ఇన్నింగ్స్‌ని భారత్ 622/7తో డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. శనివారం కూడా దాదాపు గంటసేపు ఆట సమయం వృథా అయ్యింది.

తొలి టెస్టులో 31 పరుగుల తేడాతో

తొలి టెస్టులో 31 పరుగుల తేడాతో

ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసినా.. నాలుగు టెస్టుల సిరీస్‌ని భారత్‌ 2-1తో కైవసం చేసుకోనుంది. అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో 31 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించగా.. ఆ తర్వాత పెర్త్ టెస్టులో 146 పరుగులతో ఆస్ట్రేలియా, మెల్‌బౌర్న్ టెస్టులో 137 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.

1
43626
Story first published: Sunday, January 6, 2019, 11:39 [IST]
Other articles published on Jan 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+