Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia : అక్షర్ పటేల్ కళ్లు‌చెదిరే త్రో‌..! ఖంగుతిన్న మ్యాక్సీ..! డీకేకు కిస్ ఇచ్చిన రోహిత్

India Vs Australia : Axar Patel Stunning Throw Makes Maxwell Runout, Rohit Kisses DK Helmet

హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఆసీస్ మూడో టీ20 రసవత్తరంగా సాగుతుంది. నాగ్‌పూర్‌లో సాధించిన విజయంతో రెట్టించిన ఆత్మవిశ్వాసాన్ని అందుకున్న టీమిండియా.. చివరి మ్యాచ్‌లోనూ గెలవాలని పట్టుదల ప్రదర్శిస్తోంది. ఈ మ్యాచ్ టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ..

తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక టాస్ సమయంలో హైదరాబాద్ క్రౌడ్ ఛీరింగ్ ఓ రేంజులో ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ మరోసారి తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక ఫీల్డింగ్లో అతనో అద్భుత రనౌట్ చేశాడు. అతని దెబ్బకు మ్యాక్స్ వెల్ (6పరుగులు 11బంతుల్లో) వెనుదిరిగాడు.

అసలేలా రనౌట్ చేశాడంటే..

8వ ఓవర్ చాహల్ బౌలింగ్‌‌కు దిగాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని మ్యాక్స్ వెల్ ఫైన్ లెగ్ దిశగా బాదాడు. బౌండరీ వద్ద అద్భుతంగా బాల్ అందుకున్న అక్షర్ పటేల్.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్ట్రైకర్ ఎండ్ వైపు బాల్ విసిరాడు. అయితే రెండో రన్ కోసం ప్రయత్నిస్తున్న మ్యాక్సీ ఆ బంతి నేరుగా వికెట్లను తాకుతుందని అస్సలు ఊహించి ఉండడు. అందుకే డైవ్ దూకలేదు. ఇక దినేష్ కార్తీక్ సైతం తొలుత గ్లవ్స్ వికెట్లకు తాకించడంతో ఒక బెయిల్ ముందే లేచింది. అయితే బాల్ నేరుగా వచ్చి వికెట్లకు తాకడంతో రెండో బెయిల్ కూడా లేచింది. దీంతో అంపైర్ ఔటిచ్చాడు. అంతే స్టేడియం హోరెత్తింది. మ్యాక్సీ ఖంగుతిన్నాడు.

మరోసారి డీకే, రోహిత్ సరదా

ఈ ఔట్ అనంతరం రోహిత్ మరోసారి డీకేతో సరదాగా వ్యవహరించాడు. కీపర్ దినేష్ కార్తీక్ ముందే గ్లోవ్స్ వికెట్ల తాకించడంపై కాస్త సీరియస్ అయినట్లు కన్పించినా.. తర్వాత ఔట్ అని స్టేడియం డిస్ ప్లేపై కన్పించగానే వెంటనే నవ్వుకుంటూ వచ్చి డీకే హెల్మెట్ ముద్దాడాడు. రిప్లేలో ఈ విజువల్ కన్పించడం ఆసక్తికరంగా అన్పించింది. ఇక మ్యాచ్‌లో రవీంద్రా జడేజా లేని లోటును అక్షర్ పటేల్ అటు బౌలింగ్లో, బ్యాటింగ్లో, ఫీల్డింగ్లో దాదాపుగా భర్తీ చేస్తున్నాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే..

ఇక ఈ మ్యాచ్‌లో ఆసీస్‌కు అదిరిపోయే శుభారంభం దక్కింది. కామెరూన్ గ్రీన్ (52పరుగులు 21బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లు) ఎడాపెడా సిక్సులు బాదుతూ దంచికొట్టాడు. అతని విధ్వంసానికి భువీ, బుమ్రా కూడా బలయ్యారు. భువనేశ్వర్ కుమార్ తెలివైన బంతితో అతన్ని ఔట్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక ఫించ్ (7), స్టీవ్ స్మిత్ (9), మ్యాక్స్ వెల్ (6) నిరాశపరిచారు. అక్షర్ పటేల్, చాహల్ తలా ఓ వికెట్ తీశారు. ఇక 12ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు 4వికెట్లు కోల్పోయి 103గా ఉంది. క్రీజులో టిమ్ డేవిడ్ (5), జోష్ ఇంగ్లీస్ (23) ఉన్నారు.

తుది జట్లు :

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఆరోన్ ఫించ్ (సి), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ వేడ్ (w), డేనియల్ సామ్స్, పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

భారత్ (ప్లేయింగ్ ఎలెవన్): కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

Story first published: Sunday, September 25, 2022, 20:10 [IST]
Other articles published on Sep 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+