For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌తో సిరిస్ కోసం చెన్నైకి చేరుకున్న ఆసీస్ క్రికెటర్లు

ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టుకు చెందిన ఏడుగురు క్రికెటర్లు శుక్రవారం చెన్నైకి చేరుకున్నారు.

By Nageshwara Rao

హైదరాబాద్: ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టుకు చెందిన ఏడుగురు క్రికెటర్లు శుక్రవారం చెన్నైకి చేరుకున్నారు. భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ఆసీస్ పరిమిత ఓవర్ల స్పెషలిస్టు ఆటగాళ్లు అరోన్ ఫించ్, కౌల్టర్ నైల్, జేమ్స్ ఫల్కనర్, ట్రావిస్ హెడ్, స్టోనిస్, ఆడమ్ జంపా, రిచర్డ్ సన్‌లు ముందుగా భారత్‌కు చేరుకున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లతో కూడిన మరికొంత మంది జట్ట సభ్యులు శనివారం సాయంత్రానికి భారత్‌కు వచ్చే అవకాశం ఉంది.

India Vs Australia: Australia's limited overs specialists arrive in Chennai

భారత్‌ పర్యటనకు ప్రకటించిన ఆసీస్ జట్టులో తొలుత రిచర్డ్‌సన్ పేరు లేదు. పేసర్ జోష్ హాజెల్‌ఉడ్ స్ధానంలో అతడు చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం వీరు బంగ్లాదేశ్‌లో ఉన్నారు. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఆస్ట్రేలియా 1-1తో సమం చేసుకుంది. బంగ్లాదేశ్ పర్యటన ముగించుకున్న ఆస్ట్రేలియా జట్టులోని పలువురి ఆటగాళ్లు భారత్‌కు రానున్నారు.

కాగా, ఇరు జట్ల మధ్య తొలి వన్డే సెప్టెంబర్ 17న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు సెప్టెంబర్ 12న బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో ఆస్ట్రేలియా జట్టు వార్మప్ మ్యాచ్ ఆడనుంది.

భారత పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు:
Steve Smith (C), David Warner, Ashton Agar, Hilton Cartwright, Nathan Coulter-Nile, Patrick Cummins, James Faulkner, Aaron Finch, Travis Head, Glenn Maxwell, Marcus Stoinis, Matthew Wade (WK), Adam Zampa and Kane Richardson.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+