Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్‌కు లేని వయసు పరిమితి నెహ్రాకు ఎందుకు?: సెహ్వాగ్

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరిస్ కోసం ఎంపిక చేసిన జట్టులో 38 ఏళ్ల వయసున్న ఆశిష్ నెహ్రా ఎంపిక కావడం తనను ఎలాంటి ఆశ్చర్యానికీ గురి చేయలేదని భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. నెహ్రా ఎంపికపై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

అయితే సెహ్వాగ్ మాత్రం ఆశిష్ నెహ్రాకు మద్దతుగా నిలవడం విశేషం. 40 ఏళ్ల వరకు సచిన్ ఆడగా లేనిది.. నెహ్రా ఆడేతే తప్పేంటి అని ప్రశ్నించాడు. అంతేకాదు ఫిట్‌గా ఉండి, వికెట్లు తీసుకుంటూ, పరుగులు తక్కువగా ఇస్తున్నంత వరకు వయసు అనేది అసలు సమస్యే కాదని సెహ్వాగ్ స్పష్టం చేశాడు.

సచిన్‌ 40 ఏళ్ల వరకు క్రికెట్ ఆడాడు

సచిన్‌ 40 ఏళ్ల వరకు క్రికెట్ ఆడాడు

'సచిన్‌ టెండూల్కర్ 40 ఏళ్ల వరకు క్రికెట్ ఆడాడు. సనత్‌ జయసూర్య 42 ఏళ్ల వరకు ఆడాడు. అలాంటిది నెహ్రా విషయంలో వయసు పరిమితి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు. వరల్డ్ కప్‌లో ఆడేందుకు వయసుతో సంబంధం లేదు.

అది అడ్డంకి అని నేను ఏమాత్రం అనుకోను. నెహ్రా ఫిట్‌గా ఉంటే తక్కువ పరుగులు ఇచ్చి వికెట్లు తీస్తాడు' అని సెహ్వాగ్ అన్నాడు.

నెహ్రా ఎంపిక ఏమాత్రం ఆశ్చర్యానికి గురి చేయలేదు

నెహ్రా ఎంపిక ఏమాత్రం ఆశ్చర్యానికి గురి చేయలేదు

'నెహ్రా ఎంపిక ఏమాత్రం ఆశ్చర్యానికి గురి చేయలేదు. అతను టీమ్‌లో ఉండటం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్‌లోనూ అతడు మరిన్ని మ్యాచ్‌లు ఆడతాడని ఆశిస్తున్నాట అని సెహ్వాగ్‌ తెలిపాడు. అంతేకాదు యోయో టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు సమానంగా నెహ్రా స్కోరు చేశాడని సెహ్వాగ్ వెల్లడించాడు.

రోజులో 8 గంటలు జిమ్‌లోనే గడిపేవాడు

రోజులో 8 గంటలు జిమ్‌లోనే గడిపేవాడు

'నెహ్రా అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న సమయంలో రోజులో 8 గంటలు (రెండు సెషన్స్‌లో) జిమ్‌లోనే గడిపేవాడు. అతను ఫాస్ట్‌బౌలర్‌ కాబట్టి బౌలింగ్‌ వేసే సమయంలో ఎలాంటి ఇబ్బంది పడకూడదు. ఎంపికకు ముందు మేనేజ్‌మెంట్‌ నిర్వహించిన యో యో టెస్టులో నెహ్రా పాసయ్యాడు. ఈ టెస్టులో అతడు 17-18 పాయింట్లు సాధించాడు. కోహ్లీ కూడా ఇంతే స్కోరు చేశాడు' అని సెహ్వాగ్ అన్నాడు.

ప్రతి క్రికెటర్‌కీ ఫిట్‌నెస్‌ ఎంతో ముఖ్యం

ప్రతి క్రికెటర్‌కీ ఫిట్‌నెస్‌ ఎంతో ముఖ్యం

'ఆరు అడుగులకు పైగా ఉండే అతని ఎత్తు కూడా నెహ్రాకు అడ్వాంటేజ్. ఫిట్‌నెస్‌గా ఉన్నాడు కాబట్టే నెహ్రా జట్టులోకి రాగలిగాడు. ప్రతి క్రికెటర్‌కీ ఫిట్‌నెస్‌ ఎంతో ముఖ్యం. అదే అతని మంత్రం. యువరాజ్, రైనా యోయో టెస్టులో పాస్ కానుందుకే జట్టులో చోటు దక్కించుకోలేకపోయారని, వాళ్లు ముందు ఆ టెస్ట్ పాసయ్యేలా ఫిట్‌నెస్ పెంచుకోవాలి. ప్రస్తుత మన ఇండియన్‌ క్రికెట్‌ జట్టులో అన్‌ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లు ఎవరూ లేరు' అని సెహ్వాగ్‌ వివరించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+