అంబటి రాయుడి బౌలింగ్ అనుమానాస్పదం

హైదరాబాద్: భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు బౌలింగ్ అనుమానాస్పదంగా ఉందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. ఈ మేరకు ఆస్ట్రేలియాతో శనివారం సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డే అనంతరం మ్యాచ్ అధికారులు తమకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించింది.

సిడ్నీ వన్డేలో రెండు ఓవర్లే వేసిన రాయుడు
జనవరి 12న సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో కేవలం రెండు ఓవర్లే వేసిన రాయుడు వికెట్ ఏమీ లేకుండా 13 పరుగులు ఇచ్చాడు. అయితే, అంబటి రాయుడు యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. దీంతో తొలి వన్డేలో రాయుడి బౌలింగ్‌కు సంబంధించిన వీడియోను అధికారులు టీమ్ మేనేజ్‌మెంట్‌కు అందించారు.

రాయుడు బౌలింగ్‌ను నిశితంగా పరిశీలిస్తాం
"రాయుడు బౌలింగ్‌ను నిశితంగా పరిశీలిస్తాం. 14 రోజులపాటు అతడు బౌలింగ్ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో అతడు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేయవచ్చు. బౌలింగ్ పరీక్ష ఫలితాలు వచ్చాక తదుపరి నిర్ణయం తీసుకుంటాం" అని ఐసీసీ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.

పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా
టీమిండియా తరుపున పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా కొనసాగుతున్న అంబటి రాయుడు తన 46 మ్యాచ్‌ల వన్డే కెరీర్‌లో 20.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 41.33 సగటుతో 3 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు దేశవాళీ వన్డేలు, టి20ల్లో అతను ఒక్కసారి కూడా బౌలింగ్ చేయలేదు. ఆరు టీ 20లు ఆడినా వాటిల్లో బౌలింగ్ చేయలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications