న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'క్రికెట్‌లో ధోనీ అత్యుత్తమ ఫినిషర్‌.. మహీలా కావాలని ఉంది'

India vs Australia: Alex Carey aspires to be a match-finisher like MS Dhoni


ముంబై
: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ తరహాలోనే మంచి మ్యాచ్‌ ఫినిషర్‌గా ఎదగాలనుకుంటున్నా అని ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ అలెక్స్‌ క్యారీ తెలిపాడు. ఆస్ట్రేలియాకు ఒక ఫినిషర్‌గా మారడం కోసం యత్నిస్తున్నాఅని పేర్కొన్నాడు. తాజాగా శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను విజయవంతంగా ముగించిన టీమిండియా.. ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల పోరుకు సిద్ధమవుతోంది.

ధోనీపై గవాస్కర్‌ ఫైర్.. జాతీయ జట్టుకు ఇంత కాలం ఎవరైనా దూరమయ్యారా?ధోనీపై గవాస్కర్‌ ఫైర్.. జాతీయ జట్టుకు ఇంత కాలం ఎవరైనా దూరమయ్యారా?

ఎక్కడైనా బ్యాటింగ్‌ చేస్తా:

ఎక్కడైనా బ్యాటింగ్‌ చేస్తా:

మంగళవారం ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తొలి వన్డే జరుగనుంది. శనివారం ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా క్యారీ మీడియాతో మాట్లాడాడు. 'మిడిల్‌ ఆర్డర్‌, లోయర్‌ ఆర్డర్‌లో ఎక్కడైనా బ్యాటింగ్‌ చేసే సత్తా నాలో ఉంది. కానీ.. బ్యాటింగ్‌ చేసే క్రమంలో ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ఆస్ట్రేలియాకు ఒక మంచి ఫినిషర్‌గా మారడం కోసం యత్నిస్తున్నా' అని క్యారీ తెలిపాడు.

ధోనీలా కావాలని ఉంది:

ధోనీలా కావాలని ఉంది:

'ప్రపంచ క్రికెట్‌లో ధోనీ ఎంత అత్యుత్తమ ఫినిషర్‌ అనే విషయం మన అందరికి తెలుసు. ప్రతీ ఒక్కరూ అతన్ని ఆదర్శంగా తీసుకుంటారనేది కాదనలేని వాస్తవం. ఇందులో నేను కూడా ఉన్నా. నాకు ధోనీలా కావాలని ఉంది. అందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తా. గతేడాది ధోనీతో కలిసి చాలా ఎక్కువ క్రికెట్‌ను ఆస్వాదించడం నా అదృష్టం. అతడి నుంచి వీలైనంత నేర్చుకోవాలి' అని క్యారీ అన్నాడు.

 సొంతగడ్డపై భారత్‌తో ఆడటం చాలా కష్టం:

సొంతగడ్డపై భారత్‌తో ఆడటం చాలా కష్టం:

'సొంతగడ్డపై భారత్‌తో తలపడడం అత్యంత కఠినమైనది. అగ్రశ్రేణి బౌలర్లు బుమ్రా, షమీని ఎదుర్కోవడం మాకు అసలు సవాలు. ఇక టీమిండియా స్పిన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ వారి సొంతగడ్డ. ప్రస్తుతం ఆస్ట్రేలియా విజయాల బాటలో పయనిస్తోంది. ఇరు జట్లు బలంగా ఉండటంతో సిరీస్‌ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో నా అత్యుత్తమ ఆటను ప్రదర్శించడానికి యత్నిస్తా. ఈ సిరీస్‌లో ఆబాగా డితే టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది' అని క్యారీ చెప్పుకొచ్చాడు.

వాంఖేడేలో తొలి వన్డే:

వాంఖేడేలో తొలి వన్డే:

వాంఖేడే స్టేడియంలో మంగళవారం జరిగిగే తొలి వన్డే కోసం భారత్-ఆస్ట్రేలియా జట్లు ప్రాక్టీస్‌ సెషన్‌లో తీవ్రంగా చమటోడ్చుతున్నారు. 17న రాజకోట్‌లో రెండో వన్డే, 19న బెంగుళూరులో మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. అన్ని మ్యాచ్‌లు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం అవుతాయి.

Story first published: Sunday, January 12, 2020, 12:54 [IST]
Other articles published on Jan 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X